NTV Telugu Site icon

Nara Brahmani: రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుకే చంద్రబాబుని జైల్లో పెట్టారా..?

Nara Brahmani

Nara Brahmani

Nara Brahmani: రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుకే చంద్రబాబుని జైల్లో పెట్టారా అని నారా బ్రాహ్మణి ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు గానీ, ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ గానీ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదన కానీ ఇవన్నీ చంద్రబాబు ప్రజల కోసం తలపెట్టిన పనులు అని.. వీటినే నేరాలంటున్నారని ఆమె మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గట్టిగా నిలదీసినందుకు అంగళ్లు కేసు పెట్టారన్నారు. చంద్రబాబు మీద పెట్టిన కేసులు చూస్తుంటే ఏపీని అభివృద్ధి చేసినందుకే ఆయన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టినట్టు ఉందన్నారు. ఒక ముఖ్యమంత్రిగా ప్రజలకు ఉపయోగపడే పని చేయడం తప్పు అనే స్థాయికి రాజకీయం దిగజారుతోందని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో ఉందో అంతా గ్రహించాలన్నారు.

Also Read: AP CM Jagan: సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన టెక్‌ మహీంద్ర ఎండీ

ప్రజలకు దిక్కెవరు..: నారా భువనేశ్వరి
ఇదిలా ఉండగా.. అసలు చంద్రబాబు ఏం తప్పు చేసారని జైల్లో పెట్టారని ప్రజల్లోనూ, పార్టీ కార్యకర్తల్లో ఒకటే ఆవేదన అని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ట్విటర్‌ వేదికగా అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసినందుకా అంటూ ఆమె ప్రశ్నించారు. లేక ప్రజలు ఆనందంగా ఉండాలి, ఉన్నతంగా జీవించాలని తపించినందుకా అంటూ ఆమె పేర్కొన్నారు. అదే తప్పైతే ఇక ప్రజలకు దిక్కెవరు అంటూ నారా భువనేశ్వరి అన్నారు.

Bhuvaneshvari

Show comments