Nandamuri Thaman: ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీన విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ యుఫోరియా మ్యూజికల్ నైట్ జరగనున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ టీం ఈ మ్యూజికల్ నైట్ నిర్వహించబోతోండగా ఈరోజు హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. మేనేజింగ్ ట్రస్టీ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈ మేరకు అధికారిక ప్రకటన చేసి ఇది ఒక ఫండ్ రైజింగ్ కార్యక్రమం అని వెల్లడించారు.
Read Also:Kamala Harris: కమలా హారిస్ ఫ్యూచర్ ఫ్లాన్ ఇదేనా? 2 ఏళ్ల తర్వాత ఏం చేయబోతున్నారంటే..!
ఇక ఈ కార్యక్రమం ద్వారా రైజ్ అయిన ఫండ్స్ ని ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తల సేమియా వ్యాధి క్యాంపులకు, తల సేమియా వ్యాధిగ్రస్తుల ట్రీట్మెంట్ కి ఉపయోగించబోతున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆలోచన చేసి ఫండ్స్ రైజ్ చేసి ముందుకు ఎలా వెళ్లాలి? అని అనుకుంటూ ఉండగా తమకు ముందుగా ఒకటే పేరు గుర్తు వచ్చిందని, అది ఎన్ తమన్ అని అన్నారు. అయితే వెంటనే సారీ చెప్పి నందమూరి తమన్ అంటూ కామెంట్స్ చేశారు. గత కొంత కాలంగా తమన్ నందమూరి బాలకృష్ణతో ట్రావెల్ చేస్తున్నారు. బాలకృష్ణ చేసున్న అన్ని సినిమాలకి తమన్ సంగీతం అందిస్తున్నారు.. నందమూరి బాలకృష్ణకి తమన్ అందించే మ్యూజిక్ వేరు ఇతర హీరోలకి ఇచ్చి మ్యూజిక్ వేరు అన్నట్టుగా సోషల్ మీడియా నెటిజన్లు తమన్ కి నందమూరి తమన్ అంటూ నామకరణం చేశారు.
Read Also:HYDRA PS: బుద్ధ భవన్ ప్రక్కన హైడ్రా పోలీస్ స్టేషన్.. పరిశీలించిన కమిషనర్
అది ఇప్పటికే నందమూరి బాలకృష్ణ సహా పలువురు పలు వేదికల మీద ప్రస్తావించారు. ఇక ఇప్పుడు నారా భువనేశ్వరి కామెంట్ చేయడం గమనార్హం. ఫిబ్రవరి 15వ తేదీన విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమంలో తమన్ తో పాటు శివమణి కూడా డ్రమ్స్ ప్లే చేయబోతున్నారు, అంతే కాక దేశవ్యాప్తంగా ఉన్న 50 మంది ఆర్టిస్టులు ఈ షోలో పర్ఫామ్ చేయనున్నారు. తమన్ సంక్రాంతి సందర్భంగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమన్ సంగీతం అందించిన రాంచరణ్ తేజ గేమ్ చెంజర్ చిత్రంతోపాటు నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలకు సంగీతం అందించారు.