Site icon NTV Telugu

Nara Bhuvaneshwari : నేటి నుంచి నారా భువనేశ్వరి బస్సు యాత్ర

Bhuvaneshwari

Bhuvaneshwari

నేటి నుంచి నారా భువనేశ్వరి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలలో మూడు రోజుల పాటు పర్యటన కొనసాగనుంది. ఉదయం చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మరణించిన పాకాల మండలం, నేండ్రగుంట గ్రామానికి చెందిన కె.చిన్నబ్బ సెప్టెంబర్ 25న, చంద్రగిరికి చెందిన ఎ.ప్రవీణ్ రెడ్డి ఈ నెల 17న మృతి ఇరువురు కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శించనున్నారు. అనంతరం చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ అగరాలలో చేపట్టిన ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొననున్నారు.

Also Read : Annapoorani: బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి.. ఆ పని చేయడం తగునా నయన్.. ?

మధ్యాహ్నం 2 గంటలకు నారావారిపల్లెలో మహిళలతో భువనేశ్వరి సమావేశం కానున్నారు. అనంతరం చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ అగరాలలో చేపట్టిన ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భువనేశ్వరి ప్రసంగిస్తారు. ఇక.. రేపు తిరుపతి, ఎల్లుండి శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొంటారు భువనేశ్వరి. శ్రీకాళహస్తిలో పలు కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. నిజం గెలవాలి యాత్రకు సంబంధించిన బస్సుపై ఎన్టీఆర్, చంద్రబాబు, భువనేశ్వరి ఫొటోలతో కూడిన థీమ్ ఉంది. ‘నిజం గెలవాలి’ యాత్ర ద్వారా వారానికి మూడు రోజుల పాటు ఇంటింటికి వెళ్లి బాధిత కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారు.

Also Read : Dhruva Natchathiram: లేట్ గా వస్తున్నా.. లేటెస్ట్ గా హిట్ అయ్యే కంటెంట్ ఉన్నట్లుందే

Exit mobile version