Site icon NTV Telugu

Saripodhaa Sanivaaram Collections: ‘సరిపోదా శనివారం’ కలెక్షన్స్.. ఫస్ట్ డే ఎంత వచ్చాయంటే?

Saripodhaa Sanivaaram Collections

Saripodhaa Sanivaaram Collections

Saripodhaa Sanivaaram Collections: ఎప్పటికప్పుడు జోనర్లు మారుస్తూ సినిమాలు చేస్తున్న కథానాయకుడు ‘నేచురల్ స్టార్’ నాని. ‘అంటే… సుందరానికి’ తర్వాత నాని, వివేక్ ఆత్రేయ కలిసి చేసిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మొదటిరోజు మంచి టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. సరిపోదా శనివారం ఫస్ట్ డే కలెక్షన్స్ దాదాపుగా 9 కోట్ల రూపాయలు (షేర్) అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సరిపోదా శనివారం సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.5 కోట్ల షేర్ రాబట్టింది. ఆల్ ఓవర్ ఇండియాలో రూ. 8.50 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ చిత్రానికి ఓవర్సీస్ మార్కెట్ వసూళ్లు కూడా బాగున్నాయి. 1 మిలియన్ మార్క్ రీచ్ అయింది. మొత్తంగా మొదటి రోజున 9 కోట్ల షేర్ వచ్చింది. తద్వారా ‘దసరా’ తర్వాత నాని రెండో అత్యధిక ఓపెనింగ్స్‌ను అందుకున్నాడు. దసరా సినిమాకు ఫస్ట్ డే రూ.38 కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందని ఎస్‌ఎల్‌వి సినిమాస్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఇందులో రూ.23.50 కోట్లు షేర్ అని ట్రేడ్ వర్గాల టాక్. దాంతో కంపేర్ చేస్తే సరిపోదా శనివారం వెనుక పడిందని చెప్పాలి.

Also Read: Bad Newz OTT: ఓటీటీలోకి వచ్చేసిన త్రిప్తి దిమ్రీ బోల్డ్ మూవీ ‘బ్యాడ్‌ న్యూజ్‌’!

సరిపోదా శనివారం మూవీలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. ఇందులో ఎస్‌జే సూర్య విలన్ పాత్ర చేశారు. అభిరామి, అదితి బాలన్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించారు.ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించారు.

Exit mobile version