Site icon NTV Telugu

Nani Heroine: ఆ ఇద్దరిలో నాని హీరోయిన్ ఎవరు?

Shraddha, Janhvi

Shraddha, Janhvi

Nani, Srikanth Odela 2nd Movie: 2023లో హీరో నాని, డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల కాంబోలో వచ్చిన ‘దసరా’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూలు చేసి.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దసరా చిత్రం డబ్బులతో పాటు సైమా, ఐఫా అవార్డులను కూడా కొల్లగొట్టింది. ఈ సినిమా ఇచ్చిన నమ్మకంతో నాని, శ్రీకాంత్‌ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతోంది. దసరా 2024 సందర్భంగా ‘నాని ఓదెల 2’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రం ఆరంభమైంది.

సికింద్రాబాద్‌ నేపథ్యంలో సాగే ఓ పీరియాడిక్‌ కథని డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల సిద్ధం చేశారని తెలుస్తోంది. దసరా సినిమాతో పోలిస్తే.. వంద రెట్లు అధిక ప్రభావం చూపించే కథ ఇదట. ఇందులో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఈ సినిమా కోసం ముందుగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను చిత్రబృందం సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా మరో బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌ పేరు తెరపైకి వచ్చింది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా కాబట్టి.. ఆ రేంజ్ కథానాయిక కోసం చూస్తున్నారట.

Also Read: Citadel Honey Bunny: 11 నిమిషాల సీన్‌ సింగిల్‌ టేక్‌లో చేశాం: వరుణ్‌

జాన్వీ కపూర్‌ లేదా శ్రద్ధా కపూర్‌లలో ఒకరు నాని సరసన నటించే అవకాశాలు ఉన్నాయి. జాన్వీ తెలుగులో ఇప్పటికే ‘దేవర’ సినిమాలో నటించారు. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన నటిస్తున్నారు. మరోవైపు సాహో సినిమాలో శ్రద్ధా నటించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆమె స్త్రీ 2తో భారీ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఈ ఇద్దరిలో ఎవరైనా గ్లామర్‌కు డోకా ఉండదు. సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version