Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani Next Movies: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ఊరమాస్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise) సినిమా 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిన్నరగా ఈ సినిమా కోసం నాని ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పడు థియేట్రికల్ హవా నడిచాక కూడా నాని ఖాళీగా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే ‘బ్లడీ రోమియో’ సినిమాను లైన్లో పెట్టుకున్న నాని.. ఇప్పుడు మరో రెండు కొత్త ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని చేతిలో ఏకంగా మూడు సినిమాలు ఉండబోతున్నాయి.
నాని, దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘బ్లడీ రోమియో’ ఇప్పటికే అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాను గత ఏడాదే ప్రారంభించాలని నాని భావించారు. 2025లో షూటింగ్ మొదలుపెట్టి, 2026 క్రిస్మస్ సందర్భంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. అయితే ‘ది ప్యారడైజ్’ షూటింగ్ ఎక్కువ కాలం కొనసాగడంతో ‘బ్లడీ రోమియో’ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. ఇప్పుడు అక్టోబర్ నుంచి నాని ఈ సినిమా షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం.
Also Read
- LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
- Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
సుజీత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘బ్లడీ రోమియో’ షూటింగ్లో ఎక్కువ భాగం లండన్‌లో జరగనుందని తెలుస్తోంది. కథకు తగ్గట్టుగా విదేశీ లొకేషన్లలో భారీ యాక్షన్, విజువల్ సన్నివేశాలను తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ముందుగా 2026 క్రిస్మస్ రిలీజ్ అనుకున్నప్పటికీ, ఇప్పుడు ఈ సినిమాను 2027 సమ్మర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ‘బ్లడీ రోమియో’తో పాటు నాని మరో క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పినట్లు సమాచారం. ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ‘జెర్సీ’ తర్వాత నిర్మాత నాగ వంశీ మరోసారి నానితో కలిసి పనిచేయబోతున్నారని తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. ‘లక్కీ భాస్కర్’ వంటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకీ అట్లూరి.. నానితో ఎలాంటి కథను తెరకెక్కించబోతున్నారనే ఆసక్తి ఇప్పటికే మొదలైంది.
మరోవైపు తమిళ దర్శకుడు సిబి చక్రవర్తితో నాని సినిమా గురించి కూడా చాలాకాలంగా చర్చలు జరుగుతున్నాయి. బడ్జెట్‌కు సంబంధించిన సమస్యల కారణంగా ఈ ప్రాజెక్ట్ కొంతకాలం ముందుకు వెళ్లలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా మళ్లీ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివకార్తికేయన్‌తో ‘సిబి చక్రవర్తి’ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత 2027లో నానితో సినిమా ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇలా ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని కెరీర్లో వరుసగా మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ముందుగా అక్టోబర్ నుంచి ‘బ్లడీ రోమియో’ షూటింగ్ మొదలుకానుండగా, ఆ తర్వాత వెంకీ అట్లూరి ప్రాజెక్ట్, సిబి చక్రవర్తి సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలు ఒకదానికొకటి భిన్నమైన కథలతో తెరకెక్కనున్నట్లు తెలుస్తుండటంతో నాని అభిమానులకు రాబోయే రెండేళ్లు వరుస సినిమాలతో ఫుల్ ట్రీట్ ఉండబోతోందని చెప్పొచ్చు.
- Tags
- cinema
- Nani Next Movies
తాజావార్తలు
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!