Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gladiators Trailer: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు సినిమాలతో పాటు రేసింగ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ మోటార్‌స్పోర్ట్స్‌పై తనకున్న అభిరుచిని మాత్రం ఆయన ఎప్పుడూ వదులుకోలేదు. ఇప్పుడు ఆయన రేసింగ్ ప్రయాణం ఆధారంగా తెరకెక్కుతున్న ‘గ్లాడియేటర్స్: ఇన్ పర్స్యూట్ ఆఫ్ ఛాలెంజెస్’ డాక్యుమెంటరీ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా విడుదలైన ట్రైలర్లో అజిత్ రేసింగ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు ఆయన భార్య శాలిని, పిల్లలు అనూష్క, ఆద్విక్ కూడా కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది.
సుమారు నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ పూర్తిగా అజిత్ రేసింగ్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేలా ఉంది. రేసింగ్ కార్లు, హైస్పీడ్ డ్రైవింగ్, కఠినమైన సర్క్యూట్లు, ఎండ్యూరెన్స్ రేసుల్లో ఎదురయ్యే సవాళ్లు ఇలా ప్రతి అంశాన్ని ఇందులో చూపించారు. సినిమాల్లో హీరోగా కనిపించే అజిత్‌కు మరో కోణంలో ఎంతటి పోటీతత్వం ఉందో ఈ విజువల్స్ చూస్తే తెలుస్తోంది. రేసింగ్ సమయంలో ఎదురయ్యే ఒత్తిడి, మానసిక సవాళ్ల గురించి ఆయన టీమ్ సభ్యులు కూడా తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ ట్రైలర్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం శాలిని అజిత్‌కుమార్, వారి పిల్లలు అనూష్క, ఆద్విక్ కనిపించడమే. సాధారణంగా అజిత్ కుటుంబం మీడియాకు చాలా దూరంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలను పబ్లిక్ ఈవెంట్స్‌లో చాలా అరుదుగానే చూస్తుంటాం. అలాంటి సమయంలో ఈ డాక్యుమెంటరీలో వారు అజిత్ రేసింగ్ కెరీర్ గురించి తమ అభిప్రాయాలను పంచుకోవడం విశేషం.
Also Read
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
- Vicky Kaushal - Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ - ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
అజిత్ రేసింగ్ టీమ్ సభ్యులతో పాటు మోటార్‌స్పోర్ట్స్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ డాక్యుమెంటరీలో కనిపించారు. భారతదేశపు తొలి ఫార్ములా వన్ రేసర్ నరైన్ కార్తికేయన్ కూడా ఇందులో భాగమయ్యారు. మోటార్‌స్పోర్ట్స్‌పై అజిత్ చూపించే అంకితభావం గురించి కార్తికేయన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. దీంతో ‘గ్లాడియేటర్స్’ కేవలం అజిత్ అభిమానుల కోసం రూపొందించిన ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా రేసింగ్ ప్రపంచాన్ని కూడా ప్రేక్షకులకు పరిచయం చేసే డాక్యుమెంటరీగా కనిపిస్తోంది. ఏఎల్ విజయ్ ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అజిత్ పాల్గొన్న ఎండ్యూరెన్స్ రేసులు, ట్రాక్‌పై ఎదుర్కొన్న అనుభవాలను ఇందులో చూపించనున్నారు. అయితే ఈ డాక్యుమెంటరీని ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారనే విషయంపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
ఇక సినిమాల విషయానికి వస్తే అజిత్ చివరిగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రంలో కనిపించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో అజిత్ ఏకే పాత్రలో నటించారు. త్రిష కృష్ణన్, అర్జున్ దాస్, సునీల్, ప్రభు, ప్రసన్న, కార్తికేయ దేవ్, ప్రియా ప్రకాష్ వారియర్, జాకీ ష్రాఫ్, షైన్ టామ్ చాకో తదితరులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు. మరోవైపు అజిత్ త్వరలోనే అధిక్ రవిచంద్రన్‌తో మరోసారి కలిసి పనిచేయనున్నారు. ‘డేర్ డెవిల్’ పేరుతో తెరకెక్కనున్న ఈ యాక్షన్ మూవీని శాలిని అజిత్‌కుమార్ నిర్మించనున్నారు. ఈ సినిమా షూటింగ్ 2026 నవంబర్ 2 నుంచి ప్రారంభం కానుందని సమాచారం. తదుపరి రేసింగ్ సీజన్‌కు ముందే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేయాలని అజిత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒకవైపు సినిమాలు, మరోవైపు రేసింగ్‌తో బిజీగా ఉన్న అజిత్ జీవితంలోని మరో కోణాన్ని ‘గ్లాడియేటర్స్’ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది.
- Tags
- Ajith Kumar
- cinema
తాజావార్తలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు