Nani: ‘దసరా’, ‘సరిపోదా శనివారం’, ‘హిట్ 3’ వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరో నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం ఈ హీరో పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. తాజాగా నాని కొత్త సినిమాపై ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాని కొత్త సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
READ ALSO: Marriage Fraud: నిత్య పెళ్లి కూతురు..! యువకులే టార్గెట్.. పెళ్లి తర్వాత లక్షలతో జంప్..!
అన్‌టైటిల్డ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్టోరీ, డైరెక్టర్ ఫైనల్ అయిపోయారని, 2026 సెకండ్ హాఫ్‌లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని టాలీవుడ్ సర్కిల్స్‌లో జోరుగా టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు వీడియోలలో సితార నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నానితో సినిమా దాదాపు సినిమా ఫిక్స్ అయినట్లే అని, అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా 2026 సెకండ్ హాఫ్‌లో షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. ప్రస్తుతం నాని ‘ది పారడైస్’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఒడెల దర్శకత్వంలో రూపొందుతుంది. ఈ చిత్రం మార్చి 26, 2026న రిలీజ్‌కు రడీ అవుతుంది. దీని తర్వాత నాని సుజీత్ డైరెక్షన్‌లో సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్ కూడా 2026లోనే రిలీజ్ అవుతుందని టాక్. ఇక సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రాజెక్ట్ 2026 చివరి భాగంలో షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం. అన్ని ఫైనల్ అయిన తర్వాత సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
READ ALSO: Pragati: ‘అలాంటి వాళ్లు భూమికి భారం… పెట్రోల్ పోసి కాల్చిపడేస్తా’
