Site icon NTV Telugu

Nandyal: ముగ్గురు చిన్నారులను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి..!

Murder

Murder

Nandyal: నంద్యాల జిల్లాలోని ఉయ్యాలవాడ మండలం తొడుములదీన్నే గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో తండ్రే తన ముగ్గురు చిన్నారులను హత్య చేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన గ్రామాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. స్థానికుల సమాచారం ప్రకారం వేములపాటి సురేంద్ర (34) అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో ఉన్న సమయంలో తన పిల్లలపై దాడి చేసి హత్య చేసిన అనంతరం సురేంద్ర ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

 Hyderabad Liquor Sales: ఆల్‌టైం రికార్డ్‌.. హైదరాబాద్‌లో భారీగా పెరిగిన లిక్కర్ అమ్మకాలు..

ఈ ఘటనలో తండ్రి చేతిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు సిగిన్నారుకు కావ్య (7), ధ్యానేశ్వరి (4), సూర్య గగన్ (2)గా గుర్తించారు. ఒక్కసారిగా ముగ్గురు పిల్లలు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక పిల్లల తల్లి 8 నెలల క్రితమే మరణించినట్లు సమాచారం. ఈ ఘటన విషయం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని స్థానికులు చెబుతుండగా, పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటనతో గ్రామ ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. చిన్నారుల మృతి ప్రతి ఒక్కరిని కలచివేసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

LPG Price Hike: కొత్త ఏడాది వేళ బిగ్‌షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు

Exit mobile version