Nandigama: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొండితోక జగన్ మోహన్ రావు.. నందిగామ నియోజకవర్గలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆయన.. ఈ రోజు కంచికచర్ల పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకు తిరుగుతూ,ప్రజలను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని.. తనను గెలిపించడంతో పాటు.. మరోసారి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు.. ఇక, కంచికచర్లలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మొండితోక జగన్ మోహన్ రావు మాట్లాడుతూ.. గడప ,గడపకు ఎన్నికల ప్రచారంలో తిరుగుతుంటే ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు.. రెండోసారి మరల మా ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చి అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రజలందరూ బాగున్నాయి అంటున్నారని వెల్లడించారు. నందిగామ నియోజకవర్గంలో మళ్లీ మేం గెలిచిన తర్వాత, అందరికి మంచినీటి, డ్రైనేజీ సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొండితోక జగన్ మోహన్ రావు.
Read Also: Delhi : హోటల్‌లో 70 మంది పాకిస్థానీయులు.. మిలటరీ బలగాల మోహరింపు