Site icon NTV Telugu

Nandamuri Mokshagna Debut: ‘ఆదిత్య 999 మ్యాక్స్’తో బాలయ్య వారసుడి ఎంట్రీ!

Balakrishna Nandamuri Moksh

Balakrishna Nandamuri Moksh

Nandamuri Mokshagna Debut: నందమూరి అభిమానులు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఒక కల్ట్ క్లాసిక్ సినిమాకు సీక్వెల్‌తో మోక్షజ్ఞ తేజ హీరోగా పరిచయం అవుతున్నాడని టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిత్య 369’ తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే ఈ కథకు కొనసాగింపుగా ‘ఆదిత్య 999 మ్యాక్స్’ను ప్లాన్ చేశారు మేకర్స్. ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో వారసుడు వెండి తెరపై కనిపిస్తాడని ఆసక్తిగా ఎదురు చూస్తున్న నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెబుతూ.. మోక్షజ్ఞ ఈ భారీ ఫ్రాంచైజీలోకి ఎంటర్ అయ్యాడని ప్రస్తుతం సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది.

READ ALSO: Su-57 fighter Jet: రష్యా Su-57 ఫైటర్ జెట్ కొనుగోలుకు భారత్ ఆసక్తి..

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును డైరెక్టర్ క్రిష్ జగర్లమూడి తెరకెక్కించబోతున్నారని టాక్‌ నడుస్తుంది. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చారిత్రాత్మక చిత్రంతో బాలయ్యకు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన క్రిష్, ఇప్పుడు మోక్షజ్ఞను ఏ రేంజ్‌లో వెండితెరప ప్రెజెంట్ చేస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హై-క్వాలిటీ విజువల్స్, డీప్ ఎమోషన్స్, పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఉండబోతుందని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని సమాచారం. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. షూటింగ్ షెడ్యూల్, ఫస్ట్ లుక్ అప్‌డేట్స్ త్వరలోనే వచ్చే అవకాశం ఉందని సమాచారం.

READ ALSO: Spirit: డార్లింగ్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘స్పిరిట్’లో డాన్ లీ క్యామియో? మార్చి 1న అప్‌డేట్ వస్తోందా!

Exit mobile version