Site icon NTV Telugu

Nandamuri Mokshagna: ‘వచ్చేస్తున్నా’.. అంటూ అరంగేట్రానికి సిద్దమైన బాలయ్య కుమారుడు..

Mokshanga

Mokshanga

Nandamuri Mokshagna : నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టబోతున్నట్లు కన్ఫామ్ అయ్యింది. అతను ఎవరో కాదండోయ్.. నరసింహ నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ. ఇతను ఎప్పటినుంచో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడతాడని ప్రచారం జరుగుతున్న ఎలాంటి వార్తలు మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. అయితే ఇప్పుడు ఈ నిరీక్షణకు తెరపడింది. మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి రంగం సిద్ధం అయిపోయింది.

RBI: ఇప్పటికీ రూ.7000 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ప్రజల వద్దే ఉన్నాయ్..

అయితే మోక్షజ్ఞ మొదటి సినిమా గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియకపోయినా.. మోక్షజ్ఞ సంబంధించిన కొత్త ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదివరకు కాస్త బొద్దుగా కనిపించిన ఆయన ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలో మాత్రం స్టైలిష్ గా కనబడుతున్నాడు. హ్యాండ్సమ్ గా, స్లిమ్ గా ఉన్న ఫోటోలను తాజాగా మోక్షజ్ఞ ట్విట్టర్లో షేర్ చేస్తూ.. ” వస్తున్నా.. మీ అందరి ఆశీస్సులు కావాలంటూ” రాస్కొచ్చాడు. దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది.

Qantas Flight: ఫ్లైట్‌లో అస్వస్థత.. ప్రాణాలు విడిచిన భారత సంతతి యువతి

ఈ ఫోటో చూసిన నందమూరి అభిమానులు తెగ ఆనంద పడిపోతున్నారు. ఇది వరకే విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లోని బాలకృష్ణ మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి హింట్ ఇవ్వనే ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం అతి త్వరలో కాబోతున్నట్లు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ మొదటి సినిమా ఏ డైరెక్టర్ తో చేస్తున్నాడన్నది వందల డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే బాలయ్యకు అపజయాన్ని ఇవ్వకుండా ముందుకు సాగిస్తున్న దర్శకుడు బోయపాటి శ్రీను. ఈయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే ఈ విషయం ఇంకా ఫైనల్స్ కాలేదు. ఇక మోక్షజ్ఞ మొదటి సినిమాను బాలకృష్ణ నే నేరుగా నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం.

Exit mobile version