Site icon NTV Telugu

Nandamuri Kalyanram : కళ్యాణ్‌రామ్‌ సినిమాలో ఇరానియన్ బ్యూటీ ఎల్నాజ్ నొరౌజీ

Kalyan Ram

Kalyan Ram

నందమూరి కళ్యాణ్ రామ్ చివరిసారిగా నటించిన అమిగోస్ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు, కళ్యాణ్ రామ్‌ తన దృష్టిని పూర్తిగా తన కొత్త చిత్రం డెవిల్ వైపు మళ్లించాడు. నవీన్ మేడారం దర్శకత్వం వహించిన, అధిక బడ్జెట్ పీరియాడికల్ డ్రామాలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఇరానియన్ బ్యూటీ ఎల్నాజ్ నొరౌజీ ఒక ప్రత్యేక పాటలో ఈ సినిమాలో కనిపించనుంది.

Also Read : Asia Cup : పాక్ కు ఇదే లాస్ట్ ఛాన్స్.. ఆసియా కప్ నిర్వహణే ప్రధాన లక్ష్యం..!

మేకర్స్ ఈ పాట కోసం ప్రత్యేకంగా వేసిన సెట్ కోసం రూ.3 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై టీమ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అభిషేక్ పిక్చర్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.

Also Read : MLC Kavitha : ఈడీ విచారణకు బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత

Exit mobile version