NTV Telugu Site icon

Nanda Kumar : పూజల కోసం మాత్రమే మేము ఫాంహౌస్‌కు వెళ్ళాం

Nanda Kumar

Nanda Kumar

మెయిన్‌బాద్‌లోని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫాంహౌజ్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. నాటకీయ పరిణామాల మధ్య నందకుమార్‌, సింహయాజులు, రామ చంద్రభారతి లను అరెస్ట్‌ చేశారు పోలీసులు. అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అయితే.. ఈ నేపథ్యంలో స్పష్టమైన ఆధారాలు లేవని న్యాయమూర్తి రిమాండ్‌ను తిరస్కరించడంతో నంద కుమార్‌, సింహయాజులు, విష్ణువర్థన్‌రెడ్డిలను విడుదల చేశారు పోలీసులు. ఈ క్రమంలో నంద కుమార్ మాట్లాడుతూ.. పూజల కోసం మాత్రమే మేము ఫామౌస్ కు వెళ్ళామని వెల్లడించారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో వాస్తవం లేదని ఆయన మండిపడ్డారు.
Also Read :

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేసినట్టు మాకు తెలియదని, సింహయాజులు స్వామిజీ తో సామ్రాజ్య లక్మి పూజ జరిపించడానికి మాత్రమే ఫాంహౌస్ కు వెళ్ళామన్నారు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలోనే ఇదంతా చేస్తున్నారని, ఎన్నికలు కాబట్టే ఏలాంటి సమాచారంతో సోదాలు చేశారో మాకు తెలియదన్నారు. స్కామ్ ఎక్కడది.. అసలు ఏం స్కాం మాకు తెలియదని ఆయన అన్నారు. న్యాయాన్ని నమ్ముతున్నాం.. న్యాయ స్థానంలో న్యాయం గెలిచిందని, త్వరలో మీడియాకు అన్ని వివరాలు వెళ్లాడిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.