NTV Telugu Site icon

Viral Video: వివాదంలో మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌.. నానా పటోలే ఏం చేశారంటే..!

Nanr

Nanr

మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోలే వివాదంలో చిక్కుకున్నారు. పార్టీ కార్యకర్తతో కాళ్లు కడిగించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఇదే సంస్కృతి అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇది కూడా చదవండి: Karnataka High Court: 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో కోర్టు కీలక తీర్పు..

మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే అకోలా జిల్లాలోని వాడేగావ్‌ అనే ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యటన ముగించుకుని తిరిగి తన కార్లో కూర్చున్నారు. అయితే ఇటీవలే కురిసిన వర్షాల కారణంగా పటోలే పర్యటించిన ప్రాంతం బురదమయమైంది. బురద కాళ్లను శుభ్రం చేసుకునేందుకు నీళ్లు తేవాలంటూ కాంగ్రెస్‌ కార్యకర్తను పురమాయించారు. సదరు కార్యకర్త నీళ్లు తెచ్చి పటోలే పాదాల్ని శుభ్రం చేశారు. ఈ దృశ్యాలు మొబైల్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. నెట్టింట వైరల్‌గా మారింది.

ఇది కూడా చదవండి: Revathi: పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశా.. నటి షాకింగ్ కామెంట్స్!

పార్టీ కార్యకర్త తన బురద పాదాలను కడుగుతున్న వీడియో వైరల్ కావడంతో నానా పటోలేపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే కాంగ్రెస్‌ సంస్కృతి అంటూ ముంబై బీజేపీ మండిపడింది. పార్టీ కోసం ప్రాణాలను అర్పించే కార్యకర్తలను పదేపదే కాంగ్రెస్ అవమానిస్తోందని వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే కార్యకర్తతో తన బురదకాళ్లను కడిగించుకోవడం సిగ్గుచేటు అని.. ఇదేనా కాంగ్రెస్ సంస్కృతి? అని ప్రశ్నించింది.