Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nana Patekar: ప్రముఖ సీనియర్ నటుడు నానా పటేకర్ మృతికి సంబంధించి గోవా పోలీసులు అసహజ మరణం (Unnatural Death) కింద మెడికో-లీగల్ కేసు నమోదు చేశారు. అసలు ఆయన ఎలా చనిపోయారు? మరణానికి గల సరియైన కారణాలేంటి? అనే విషయాలను తెలుసుకోవడానికి ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నట్లు ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. BNSS సెక్షన్ 194 కింద కేసు నమోదు చేసిన పోలీసులు, పనాజీకి చెందిన పీఎస్ఐ నితిన్ నాయక్‌కు ఈ విచారణ బాధ్యతలను అప్పగించారు. దోనా పౌలాలోని ‘ఓషన్ పార్క్’ నుంచి నానా పటేకర్‌ను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకువచ్చే సరికి ఆయన ఇప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు కేసులో పేర్కొన్నారు. వార్త తెలిసిన వెంటనే బాంబోలిమ్‌లోని మణిపాల్ ఆస్పత్రిని సందర్శించిన పోలీసులు, అక్కడ మెడికల్ ఆఫీసర్‌తో మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు.
ఈ విచారణలో భాగంగా నానా పటేకర్ మరణానికి గల అసలు కారణాన్ని తెలుసుకునేందుకు పోలీసులు పోస్టుమార్టం నివేదికను పరిశీలించడంతో పాటు, కుటుంబ సభ్యులు, ఇతరుల నుంచి వాంగ్మూలాలను సేకరించనున్నారు. ఒకవేళ ఈ విచారణలో ఆయనది సహజ మరణమేనని తేలితే కేసును ముగించే అవకాశం ఉంది. అలా కాకుండా ఏమైనా అనుమానాస్పద పరిస్థితులు ఉన్నట్లు తేలితే మాత్రం తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. గురువారం ఉదయం మీడియాకు వివరాలు వెల్లడించిన మణిపాల్ ఆస్పత్రి ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ శేఖర్ సాల్కర్, తమ వైద్యుల బృందం ఆయనను కాపాడటానికి శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఆస్పత్రికి తీసుకువచ్చే సమయానికే ఆయన కన్నుమూశారని, దాంతో పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. ఆయనకు గుండెపోటు వచ్చిందని, అయితే దానికి గల కచ్చితమైన కారణం తెలియనప్పటికీ, అంతకుముందే ఆయన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ మందులు వాడుతున్నట్లు తమకు తెలిసిందని డాక్టర్ వెల్లడించారు. అనంతరం భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం అంత్యక్రియలు పూర్తయ్యాయి.
Also Read
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
తాజావార్తలు
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
-
Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
-
JasonSanjay : హీరోగా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!