Site icon NTV Telugu

Railway Station: తెలంగాణలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ.. విమానాశ్రయం తరహాలో అభివృద్ధి..

Namaplly Railway Station Devep

Namaplly Railway Station Devep

ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న నాంపల్లి స్టేషన్‌కు కేంద్ర ప్రభుత్వం మహర్దశ కల్పించనుంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అమృత్ భారత్ స్టేషన్ పథకం’ కింద ఈ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో నాంపల్లి రైల్వే స్టేషన్ రూపురేఖలను పూర్తిగా మార్చేయనున్నట్లు వెల్లడించారు. 2027 చివరి నాటికి ఈ స్టేషన్ అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో అత్యాధునిక హంగులతో సిద్ధం కానుంది. దీని కోసం తొలి దశలో రూ. 327 కోట్లను రైల్వే శాఖ కేటాయించింది.

Also Read:Indian Railways: తెలుగు రాష్ట్రాలకు మరో రెండు కొత్త ట్రైన్స్.. ఈ ప్రాంతాల మధ్యే..

ప్రయాణికులు రైల్వే స్టేషన్ నుంచి నాంపల్లి మెట్రో స్టేషన్‌కు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నేరుగా వెళ్లేందుకు వీలుగా అత్యాధునిక స్కై వాక్ నిర్మిస్తున్నారు. విలాసవంతమైన వెయిటింగ్ లాంజ్‌లు, ఫుడ్ కోర్టులు, పిల్లల ఆటస్థలాలు , విశాలమైన మల్టీ-లెవల్ పార్కింగ్ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. స్టేషన్ యొక్క చారిత్రక నిర్మాణ శైలిని దెబ్బతీయకుండానే లోపలి భాగాలను డిజిటలైజ్ చేయనున్నారు.

Also Read:Modi-Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు మోడీ ఫోన్.. యుద్ధంపై సంభాషణ

ఇదిలా ఉండగా.. విశాఖపట్నం మరియు హైదరాబాద్ నుంచి కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లను పట్టాలెక్కించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కేరళ వైపు వెళ్లే ప్రయాణికులకు ఇది ఎంతో ఊరటనిస్తుంది. ఇది ప్రతి మంగళవారం ఉదయం 8:20 గంటలకు విశాఖలో బయలుదేరుతుంది. ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా రాజమండ్రి-విశాఖ మార్గంలో కొన్ని రైళ్లను (07524, 17267, 17268, 07523) ఈ నెల 9వ తేదీ వరకు తాత్కాలికంగా రద్దు చేశారు. అయితే వీరికి ప్రత్యామ్నాయంగా కాకినాడ – విజయవాడ – గుంటూరు మధ్య 16 చైర్ కార్ కోచ్‌లతో కూడిన ప్రత్యేక సర్వీసులను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు.

Exit mobile version