Hyderabad: ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం.. FIRలో ఏముందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ నాంపల్లిలో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అగ్ని ప్రమాదానికి గురైన ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ను పోలీసులు సీజ్ చేశారు. ఎఫ్ ఎస్ఎల్ ల్యాబ్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం మరోసారి క్లూస్ టీం ఎస్బి తనిఖీలు కొనసాగుతున్నాయి.. అగ్ని ప్రమాద సమయంలో ఎవరున్నారనే దానిపై ఎస్బి ఆరా తీస్తోంది.. కార్యాలయంలోని సీసీ కెమెరాలు ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. మొదటి అంతస్తులోని కంప్యూటర్ ల్యాబ్ లో ప్రమాదం జరిగింది.. ప్రమాదంలో 40 కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు లాప్టాప్, పెన్ డ్రైవ్ దగ్ధం అయినట్లు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన FIR NTV చేతికి చిక్కింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
READ MORE: T20 World Cup 2026: భారత్- పాక్ మ్యాచ్‌పై అనిశ్చితి.. ఐసీసీకి, పాకిస్తాన్కి ఎంత నష్టం జరగనుందంటే..?
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
FIRలోని ముఖ్య అంశాలు.. నిన్న నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ లో అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం 10:08 గంటలకు కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాపర్టీ రూమ్‌లో దట్టమైన నల్లటి పొగ వ్యాపించింది. క్లాస్-IV ఉద్యోగి సాయి కృష్ణ మంటలను గమనించాడు. వెంటనే ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వాలని శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఇతర సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఉదయం 10:25 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్నాడు ఇన్‌స్పెక్టర్.. అప్పటికే ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లతో పొగను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఉదయం 10:30 గంటలకు అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరింది. భవనంలోని అన్ని ఎంట్రీ ఎగ్జిట్ మార్గాల వివరాలు ఫైర్ సిబ్బందికి అందజేశారు. మధ్యాహ్నం 1:30 గంటలకు మంటలు, పొగ పూర్తిగా అదుపులోకి వచ్చాయి. కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ప్రాపర్టీ రూమ్, కేస్ వెరిఫికేషన్ ఛాంబర్, అనాలిసిస్ ఛాంబర్, సర్వర్ రూమ్లకు నష్టం వాటిల్లింది. HRD హాల్, ఫర్నిచర్, పరికరాలు సహా ఇతర గదులకూ నష్టం జరిగింది. ప్రాణనష్టం, గాయాలు ఏవీ లేవు.
READ MORE: Former ICC Chairman Ehsan Mani: “మాట్లాడండి.. బయపెట్టకండి”.. అలా ఐతే భారత్-పాక్ మ్యాచ్ కష్టమే!
తాజావార్తలు
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!