UPSC పరీక్ష జూన్ 16 ఆదివారం జరగనుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఘజియాబాద్‌లో ఉదయం 7 నుండి రాత్రి 10 గంటల వరకు నమో భారత్ రైలును నడపాలని నిర్ణయించారు. రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) చుట్టూ ఉన్న కేంద్రాల్లో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం ఉదయం 8 గంటలకు బదులుగా ఉదయం 6 గంటల నుంచి నమో భారత్ రైలు సేవలను ప్రారంభించాలని నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) నిర్ణయించింది.
Read Also: Bangladeshi MP Murder: దిండుతో అదిమి, గొంతు నులిమి బంగ్లాదేశ్ ఎంపీ హత్య..
యుపిఎస్‌సి (UPSC) పరీక్ష కారణంగా ఎన్‌సిఆర్‌టిసి ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చే విద్యార్థులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా, వారు తమ పరీక్షా కేంద్రాలకు సులభంగా చేరుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం నమో భారత్ రైళ్లు సాహిబాబాద్ నుండి ఘజియాబాద్‌లోని మోడీనగర్ నార్త్ వరకు RRTS కారిడార్‌లో నడుస్తున్నాయి. నమో భారత్ ఆపరేషనల్ బ్లాక్ చుట్టూ అనేక విద్యా సంస్థలు ఉన్నాయి.. ఇక్కడ చాలా మంది అభ్యర్థులు తరచుగా పోటీ పరీక్షలకు వెళతారు. అందుకే రైళ్ల వేళలను మార్చాలని నిర్ణయించారు.
Read Also: Vishnu Priya : హాట్ పోజులతో మతి పోగొడుతున్న విష్ణు..
సాధారణంగా నమో భారత్ రైలు సేవలు ఆదివారం ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. అయితే జూన్ 16 ఆదివారం ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకు నమో భారత్ రైలు సేవలు అందుబాటులో ఉంటాయి.