Site icon NTV Telugu

Nama Nageswara Rao : కేసీఆర్‌ను గద్దె దించే సత్తా తెలంగాణలో ఎవరికీ లేదు

Mp Nama Nageshwer Rao

Mp Nama Nageshwer Rao

రఘునాధపాలెం మండలం మంచుకొండ లో జరిగిన పార్టీ ఆత్మీయ సమావేశంలో బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ను గద్దె దించే సత్తా తెలంగాణా లో ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఎవరెన్ని కలలు గన్నా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని నామా ఉద్ఘాటించారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలో 10 కి 10 సాధించి, కేసీఆర్ కు కానుకగా ఇద్దామని ఆయన అన్నారు. ప్రజా, నిరుద్యోగ,పేదల వ్యతిరేక కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలని, రానున్న ఎన్నికల్లో మాయ, మోసపు మాటలు చెప్పే వారికి బుద్ది చెప్పాలన్నారు నామా నాగేశ్వర్‌ రావు. మేము అనుభవిస్తున్న పదవులు పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెట్టిన బిక్షేనని ఆయన అన్నారు. కేసీఆర్ చలువ వల్లే నేడు తెలంగాణా దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరిందని, కేసీఆర్ కు అండగా ఉండి, మూడోసారి సీఎం గా చేసుకోవాలని ఆయన అన్నారు.

Also Read : Bellamkonda Srinivas: సమంత, తమన్నా లకు ఆ వీడియోలు పంపా.. అందుకే ఒప్పుకున్నారు

ఐదు సంవత్సరాలలో మనకు కనపడని వ్యక్తి వచ్చి నయా మాటలు చెప్తున్నాడని పేర్కొన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలకు తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందని చెప్పారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం మహిళలు, నిరుద్యోగులు, పేదల వ్యతిరేకం అన్నారు.

Also Read : Naga Chaitanya: ఆ డైరెక్టర్ కు ఉన్న కొంచెం పరువును కూడా తీసేసిన చైతన్య

Exit mobile version