NTV Telugu Site icon

Nama Nageswara Rao : ఓటు అడిగే హక్కు బీఆర్‌ఎస్‌కే ఉంది

Nama

Nama

ఖమ్మం జిల్లాలోని మధిరలో రేపు జరగబోయే సీఎం ప్రజా ఆశీర్వాద సభపై ఎంపీ నామా నాగేశ్వరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఓటు అడిగే హక్కు బీఆర్‌ఎస్‌కే ఉందన్నారు. కాంగ్రెస్ 6గ్యారంటీలను ప్రజలు నమ్మరని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పిందే చేసిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ముందుకెళ్తామని, నియోజకవర్గంలో దళిత బంధు 100 శాతం అమలుచేస్తామన్నారు. ప్రజలను పట్టించికోనివాళ్లు ఎన్నికల ముందు మాయమాటలు చెపుతున్నారని ఆయన మండిపడ్డారు.

Also Read : Israel- Hamas War: ఇజ్రాయెల్ ప్రజల కిడ్నాప్.. అల్-షిఫా ఆస్పత్రిలో దాచిన వీడియో వైరల్

అంతేకాకుండా.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించిన నాయకుడు కేసీఆర్ అని ఆయన కొనియాడారు. మధిర బీఆర్‌ఎస్ అభ్యర్థి కమల్ రాజునూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. సాగునీరు, తాగునీరు విద్యుత్‌, విద్య, వైద్య రంగాలతోపాటు మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందు వరుసలో ఉందని వివరించారు. ప్రజలందరూ ఈ అభివృద్ధిని గమనించి ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తాతా మధు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికీ అందాయని అన్నారు. వారంతా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.

Also Read : Election Commission : తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చిన ఈసీ