NTV Telugu Site icon

Nama Nageswara Rao: కొత్త పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని నామా నాగేశ్వరరావు డిమాండ్

Nama

Nama

కొత్త పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు ఎంపి నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు (సోమవారం) పార్లమెంట్ లో ఎంపీ నామ మాట్లాడూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ మెరుగైన సుపరిపాలన వల్ల రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్ వన్ గా ఉందని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా హైదరాబాద్ లో 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణలో దళితులు ఆర్థికంగా బలపడేందుకు దళిత బంధు పథకం ప్రవేశ పెట్టినట్లు ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు.

Read Also: Srinivasa Setu Flyover: తీరిని ట్రాఫిక్ కష్టాలు.. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ ప్రారంభించిన సీఎం జగన్‌

ఇంకా రైతు బంధు, రైతు బీమా, రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణే అని ఆయన అన్నారు. ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ, మహిళా రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టి, అమోదించాలని నామ పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రధాన మంత్రి మోడీకి లేఖ కూడా రాసిన సంగతిని నామ గుర్తు చేశారు. 75 ఏళ్ల ప్రయాణంలో ఈ పార్లమెంట్ లో ఎన్నో బిల్లులు ఆమోదం పొందాయని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. వాటిలో కొన్ని బిల్లుల వలన అభివృద్ధి జరిగింది.. అలాగే కొన్నిటి వలన ఇబ్బందులు కూడా వచ్చాయన్నారు.

Read Also: Union Cabinet: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల వేళ.. కేంద్ర కేబినెట్ కీలక భేటీ

రాబోయే రోజుల్లో అందరం కల్సి కట్టుగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవటానికి పని చేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు అనే విషయాన్ని ఎంపీ నామా నాగేశ్వరరావు గుర్తు చేశారు. బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే నెహ్రు, పటేల్ లాంటి వారు.. మొదటి లోక్ సభ స్పీకర్ గణేష్ వాసుదేవ్ మావ్లాంకర్ నుంచి నేటి స్పీకర్ ఓం బిర్లా వరకు 17 మంది లోక్ సభ స్పీకర్లు ఉన్నారు.. అందులో తెలుగు వారికి మూడు సార్లు ఛాన్స్ ఇచ్చారు.. నీలం సంజీవ రెడ్డికి రెండు సార్లు, బాలయోగి ఒక్కసారి స్పీకర్ గా ఉన్నారని నామా పేర్కొన్నారు.

Read Also: Klin Kaara Konidela: మూడు నెలల తర్వాత తండ్రి ఇంటికి క్లిన్ కార… వేద మంత్రాలతో ఆహ్వానం!

ఒకప్పుడు బీజేపీకి ఇద్దరు ఎంపీలు ఉండేవారు.. ఇప్పుడు 300 మందికి పైగా ఉన్నారు అని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. గత 10 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్నారు.. అలాగే ఇద్దరు ఎంపీలు ఉన్నా నాటి టీఆర్ఎస్ కోట్లాడి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను రాష్ట్రాన్ని సాధించామని ఆయన తెలిపారు. 2014 లో ఏపీ విభజన చట్టం పాస్ కావడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాంది.. దీనిపై ప్రధాని మోడీ తెలంగాణ ఏర్పాటు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది అన్నారు.. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ దేశంలోని అన్ని రంగాల్లో నెంబర్-1 స్థానంలో ఉందని పార్లమెంట్ వేదికగా ఆయన అన్నారు.