తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీని వీడే ఆలోచనలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఆయన టీడీపీ రెబల్ అభ్యర్థిగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే, పొత్తులో భాగంగా అనపర్తి అసెంబ్లీ టికెట్ బీజేపీకి కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నేడు కార్యకర్తలతో తన స్వగృహంలో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీలోనే కీలక నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పుకొచ్చారు. మా కుటుంబాన్ని నమ్ముకుని 40 ఏళ్లుగా పోరాడుతున్న కార్యకర్తలను కాపాడుకోవడం కోసం కఠిన నిర్ణయం తీసుకుంటానంటాను అని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు.
Read Also: TDP Chandrababu Naidu: నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలలో బాబు పర్యటన..!
ఇక, ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినట్టే ఇచ్చి మాట మాత్రం చెప్పకుండా లాగేసుకున్నారని అంటూ అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఐదేళ్ల పాటు రాక్షసులతో ప్రత్యక్ష యుద్ధం చేసిన తనపై 39 అక్రమ కేసులు, భౌతిక దాడులు, జైలు జీవితం, హత్యకు సఫారీ 400 మంది కార్యకర్తలపై 180కి పైగా కేసులు, లాఠీ దెబ్బలు, 24 గంటలు ప్రజల కోసమే పోరాటం చేసి కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఇవేవీ తనను కాపాడలేకపోయాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, తనకు టికెట్ ఇచ్చిన ఇవ్వకపోయిన తాను ఈసారి ఎన్నికల బరిలో ఉంటాను అని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.