Nallapareddy vs Nallapareddy: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేల సీట్ల మార్పు వ్యవహారం ఆసక్తికరంగా సాగుతోన్న సమయంలో.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న ఓ ఆడియో ఇప్పుడు చర్చగా మారింది.. నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఆయన సోదరుడు నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. అంతే కాదు.. వచ్చే ఎన్నికల్లో నా సోదరుడు ప్రసన్నకుమార్ రెడ్డికి సీటు ఇవ్వొద్దు అంటూ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి రాజేంద్రకుమార్ రెడ్డి విజ్ఞప్తి చేయడంతో కోవూరులో ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: Sachin Tendulkar Batting: సచిన్ హిట్టింగ్.. 16 బంతుల్లో 27 పరుగులు! వీడియో వైరల్
వైరల్‌గా మారిన ఆ ఆడియోలో తన సోదరుడు, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై ధ్వజమెత్తారు నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో తన సోదరుడిని మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని మండలాలను.. నాయకులకు పంచి పెట్టారు.. అక్కడ అంతా ఆ నాయకులదే హవా.. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్.. ప్రజలకు మధ్య అడ్డుగోడలా వీరు నిలిచారని ఆరోపించారు. బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన వెంకటరమంయ్య అనే వ్యక్తి సర్వం తానై వ్యవహరిస్తున్నారు.. నాతో పాటు, మా కుటుంబ సభ్యులను కూడా దూరం పెట్టారని విమర్శించారు. మాకంటే వెంకట రమణయ్యకే ప్రాధాన్యం ఇస్తున్నారు.. ప్రసన్న అన్న చేసిన తప్పిదాల వల్లే 2004.. 2014 ఎన్నికల్లో ఓడిపోయారని తెలిపారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.. ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చినా వారిని పట్టించుకోవడంలేదన్నారు. సీఎం వైఎస్ జగన్ అన్ని విషయాలు గమనించాలి.. నా సోదరుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి మరోసారి సీటు ఇవ్వద్దని ఆ ఆడియోలో విజ్ఞప్తి చేశారు నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి.