NTV Telugu Site icon

Nallamilli Ramakrishna Reddy: కాషాయ తీర్థం పుచ్చుకున్న రామకృష్ణారెడ్డి

New Project (6)

New Project (6)

Nallamilli Ramakrishna Reddy: రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా అనపర్తి సీటును బీజేపీకి అప్పగించిన విషయం తెలిసిందే. టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆ సీటు తనకే కావాలని పట్టుపట్టడంతో నేతలు దిగివచ్చారు. అతడితో ఎన్నిమంతనాలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. ఆ సీటును టీడీపీకి ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించడంతో.. చేసేదేమీ లేక ఆయన బీజేపీ నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు.

READ MORE: Ranveer Singh: డీప్‌ఫేక్ వీడియోపై రణవీర్ సింగ్ ఫిర్యాదు.. అప్‌డేట్ ఇదే!

ఈ మేరకు ఈ రోజు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ ఏపీ ఎన్నికల ఇంఛార్జ్ అరుణ్ సింగ్, సహ ఇంఛార్జ్ సిద్ధార్ధ నాద్ సింగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ.. బీజేపీ తరఫున అనపర్తి అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి పోటీ చేస్తారని వెల్లడించారు. అభ్యర్థులు మారినప్పుడు కొంత మస్తాపం ఉంటుదన్నారు. ఇద్దరి కార్యకర్తలనూ సమన్వయం చేసుకుంటూ ముందుకు నడవాలని ఆశించారు. వారి గౌరవాన్ని పార్టీ దృష్టిలో పెట్టుకుంటుందన్నారు.

అనపర్తి బీజేపీ మాజీ అభ్యర్ధి శివరామకృష్ణంరాజు ఎన్ టీవీతో (NTV)తో మాట్లాడుతూ.. తాను పార్టీ మాటకు కట్టుబడి పని చేస్తానన్నారు. కార్యకర్తల భావోద్వేగం మధ్య కండువా తీసేశారని.. కమలం కండువా తన పైనే ఉందన్నారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యమని స్పష్టం చేశారు. అనపర్తిలో బీజేపీ అభ్యర్థి గెలిచి అసెంబ్లీకి వెళ్ళడమే తన లక్ష్యమన్నారు. కమలం గుర్తు గెలుపుకోసం.. భవిష్యత్తులో తనకు అప్పజెప్పే బాధ్యత నెరవేరుస్తానన్నారు.