ఎమ్మెల్యే సుమన్ ఆగడాలను భరించలేకపోతున్నాము సుమన్ చెన్నూరు వర్గం నుండి పంపియ్యాలని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ నేత నల్లాల ఓదెలు. ఇవాళ ఆయన మంచిర్యాల జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. చెన్నూరు నియోజకవర్గం రజాకార్ల చేతిలోకి వెళ్లిపోయిందన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి టిఆర్ఎస్ పార్టీ ఇచ్చింది సుమన్ కాదని, ఆనాడు కేటీఆర్ పిలిపించి మీరు పార్టీలోనే ఉండండి ఎమ్మెల్యే పదవి ఇస్తాం అని చెప్పారన్నారు. కాంగ్రెస్ లోకి వచ్చిన తరువాత మళ్ళీ టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినందుకు ప్రజలు నన్ను క్షమించండని, రెండుసార్లు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంటికొచ్చి ఎమ్మెల్సీ పదవి ఇప్పిస్తానని చెప్పాడన్నారు. రజాకారును ఇక్కడి నుండి వెళ్లగొట్టి చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన అన్నారు. 500 కోట్లు చెన్నూరు నియోజకవర్గంలో బాల్క సుమన్ అక్రమంగా సంపాదించాడని ఆయన ఆరోపించారు.
Also Read : Tesla: భారత్‌లో బ్యాటరీ స్టోరేజ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి టెస్లా ప్రతిపాదన..
అంతేకాకుండా.. ‘నేను చనిపోయేంతవరకు కాంగ్రెస్లోనే ఉంటా.. నాకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ లో ఎవరికి టికెట్ వస్తే వాళ్లకే సపోర్ట్ చేస్తా.. ఈ ఒక్కసారి మోసపోయిన మళ్ళీ ఇంకోసారి మోసపోవాలని అనుకోవడం లేదు.. సీడీపీ నిధులు ఒక్కరికి కాంట్రాక్టు ఇచ్చి దాదాపు 20% కమిషన్ తీసుకుంటున్నాడు బాల్క సుమన్.. మందమరి పట్టణంలో మిషన్ భగీరథ నీళ్లు తాగడం లేదు నేను వేపిచ్చిన బోర్లా నీళ్లు మాత్రమే తాగుతున్నారు.. నేను చేసింది తప్పే సాదుకున్న ప్రజలు సంపు గున్న ప్రజలే..’ అని ఆయన అన్నారు.
Also Read : Vinod Kumar : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు యదాతథంగా జరుగుతాయి