NTV Telugu Site icon

10th Exam Paper Leak: కేటీఆర్‌పై కేసులు పెట్టడం ఏంటి.. లీకేజీకి కారకులెవ్వరు?: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌

Rs Praveen Kumar

Rs Praveen Kumar

నల్గొండ జిల్లా నకిరేకల్‌‌‌‌లో పదవ తరగతి పరీక్ష పేపర్ లీకేజీ ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి నకిరేకల్ పోలీస్‌స్టేసన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదైంది. పరీక్షలో మాస్ కాపీయింగ్ నిందితులతో మున్సిపల్ చైర్మన్‌కు సంబంధాలు ఉన్నాయంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్‌పై నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రజిత, శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమపై తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్‌పై నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ ఘటనపై బీఆర్‌ఎస్ లీడర్ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ స్పందించారు. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి బాద్యత వహించాల్సింది పోయి కేటీఆర్‌ మీదు కేసులు పెట్టడం ఏంటి? అని ప్రశ్నించారు.

కొమురం భీం జిల్లా కాగజ్ నగర్‌లో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ మీడియాతో మాట్లాడుతూ… ‘నల్గోండ జిల్లా నకిరేకల్‌‌‌‌లో తెలుగు పేపర్ లీకేజీ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరపాలి. రెండవ అంతస్తులోని పేపర్ ఫోటోలు తీసుకోని వెల్తుంటే వ్యవస్థ ఏం చేసింది. పోలీసులు ఉన్నారా?, విద్యాశాఖ అధికారులున్నారా?, నిఘా వ్యవస్థ ఎక్కడికి పోయింది. విద్యావ్యవస్థ చాలా ఘోరంగా ఉంది. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి బాద్యత వహించాల్సింది పోయి కేటీఆర్‌పై కేసులు పెట్టడం ఏంటి?. లీకేజీకి కారకులెవ్వరు?. అక్కడున్న వారికి లీకేజీ వ్యవహారం ఎక్కడ పెద్దగా అవుతుందో అని ఇది డైవర్షన్’ అని అన్నారు.

‘గోడదూకి పోయి ఆవిద్యార్థిని భయపెట్టించి పరీక్ష పత్రాన్ని ఫోటో తీసుకోని పోయారు. విద్యార్థిని ఎందుకు డిబార్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకాక.. మోసం చేయడం, పక్కదోవ పట్టించడం పనిగా పెట్టుకున్నాడు. ఆరు మంది పేపర్ లీకేజీ కోసం పనిచేసారు. వారి కులాలు కేటీఆర్‌కు ఎలా తెలుస్తది. రాష్ట్రంలో ప్రజా పాలన కాదు.. ప్రజల మీద, ప్రతిపక్షాల మీద ప్రతీకార పాలన సాగిస్తున్నారు. అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. మీరు పెట్టిన కేసుల ఎఫ్ఐఆర్‌ను కోర్టులు కొట్టేస్తున్నాయి. పోలీసులు బీఎన్ఎస్ యాక్ట్ చదుతున్నారా?.. లేక రేవంత్ రెడ్డి గాంధీ భవన్ నుంచి చెప్పగానే కేసులు పెడుతున్నారా?. ఇంతకీ పోలీసు వ్యవస్థ ఉందా?. ఈ ఘటనపై రేవంత్ రెడ్డి సర్కార్ సమాధానం చెప్పాలి’ అని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ డిమాండ్ చేశారు.