Woman Rings Doorbells : అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఉన్నట్లుండి కాలింగ్ బెల్ మోగింది. ఒక సారి మోగగానే ఎవరో అయి ఉంటారులే అని ఇంటి యజమాని పడుకున్నాడు. కానీ ఆగకుండా అలాగే బెల్ మోగుతుండడంతో నిద్రనుంచి లేచి కోపంగా డోర్ తెరచాడు. ఎదురుగా ఉన్న సీన్ చూసి షాక్ తిన్నాడు.. నోటి వెంట మాట రాలేదు. కాళ్లు చేతులు గడగడవణుకుతున్నాయి. కట్ చేసి చూస్తే ఎదురుగా దెయ్యం… బట్టలేవు.. జుట్టంతా విరబోసుకుని ఎదురుగా నిల్చుని ఉంది. ఏం చేయాలో కూడా అర్థం కావడంలేదు. కాసేపైన తర్వాత ఆ దెయ్యం నడుచుకుంటూ వెళ్లింది. ఊపిరి పీల్చుకుని షాకునుంచి బయటకు వచ్చి ఫాలో అయ్యాడు. అప్పుడు అర్థం అయింది.
Read Also: A man With 12 Wives: పుట్ల కొద్దీ పిల్లల్ని కన్నడు.. ఇప్పుడు ప్లానింగ్ అంటున్నడు..
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని రామ్ పూర్ లో మిలక్ ప్రాంతంలో జరిగింది. అర్ధరాత్రుళ్లు ఓ మహిళ కొన్ని రోజులుగా ఇదే చేస్తోంది. ఆ మహిళ పలు ఇళ్ల ముందు కాలింగ్స్ బెల్స్ మోగిస్తున్నట్టు, డోర్లను తడుతున్నట్టు సీసీటీవీ కెమెరాల్లోనూ రికార్డు అయింది. ఈ వీడియో ఫుటేజీలు సామాజిక మాధ్యమాలపైకి చేరాయి. దీనిపై స్థానికుడు ఒకరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సదరు మహిళను గుర్తించామని, వారి తల్లిదండ్రులతో మాట్లాడిన అనంతరం.. మానసిక అనారోగ్యంతో ఆమె బాధపడుతున్నట్టు తెలుసుకున్నామని ప్రకటించారు. గత ఐదేళ్లుగా బరేలీలో ఆమెకు చికిత్స కొనసాగుతున్నట్టు చెప్పారు.
Read Also: New Scheme : ఆమ్మాయి పుడితే ఐదువేలు.. సర్పంచ్ ను పొగుడుతున్న జనం
సంబంధిత మహిళ మరోసారి అలా వీధుల్లోకి రాకుండా చూసుకోవాలని ఆమె తల్లిదండ్రులకు పోలీసులు స్పష్టంగా చెప్పారు. అనవసరంగా వదంతులు వ్యాప్తి చేయవద్దని ప్రజలకు సూచించారు. ‘‘రామ్ పూర్ లోని రోడ్డుపై అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో మహిళ తిరుగుతోంది. ఎవరో తెలియడం లేదు. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి? సీసీటీవీ ఫుటేజీలో ఆమె దిగంబరంగా తెల్లవారుజామున 3 గంటల వరకు తిరిగినట్టుంది. పోలీసులు ఎక్కడ ఉన్నారు అసలు? శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంది?’’ అంటూ పోలీసుల తీరును ట్విట్టర్ లో ఓ వ్యక్తి ఎండగట్టాడు.
#Rampur #viralvideo बिना कपड़ो वाली लड़की का वीडियो,
लोगों को दे रही है जान से मारने की धमकी,
ये वायरल वीडियो रामपुर जिले के मिलक थानाक्षेत्र का बताया जा रहा है,
सीसीटीवी में दूसरों के घर की बजा रही है घण्टी…#Trending @rampurpolice @wpl1090 @UPPViralCheck @UpPolicemitra pic.twitter.com/tZ4MyNgN0J— Atal Tv (@AtalTv_UP) February 2, 2023