బుల్లితెర సీరియల్ హీరో మానస్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సీరియల్స్ లో నటించి జనాల మనసును దోచుకున్నాడు.. బిగ్ బాస్ లో కూడా మెరిసాడు.. ఇలా అందరికీ మానస్ సుపరచితమే.. వెండి తెరపై బాలనటుడిగా పరిచయం అయిన మానస్.. హీరోగా గోళీసోడా వంటి కొన్ని ల్లో నటించాడు. అనంతరం కోయిలమ్మ సీరియల్ తో బుల్లి తెరపై అడుగు పెట్టాడు. అయితే మానస్ కు వెండి తెరపై కంటే బుల్లి తెర ప్రేక్షకుల ఆదరణ అధికం.. ఇక విషయానికొస్తే మానస్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే..
ఇక మొన్నీమధ్య స్టార్ మా పరివార్ అవార్డ్స్ లో భాగంగా అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్ మేల్ కేటగిరీలో రాజ్ పాత్రకు గాను మానస్ అవార్డును అందుకున్నాడు. ఈ సందర్భంగా మానస్ మాట్లాడుతూ.. తనకు కాబోయే భార్య శ్రీజను అందరికి పరిచయం చేశాడు. వారిద్దరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని.. తనకు అర్ధం చేసుకునే భార్య వస్తే చాలు అనుకున్నా.. ఆ లక్షణాలు శ్రీజలో ఉన్నాయి.. అందుకే శ్రీజతో పెళ్ళికి అంగీకరించినట్లు వెల్లడించాడు.. ఇక తాజాగా తమ పెళ్లి తేదీని అనౌన్స్ చేశాడు.. ఈనెల 22న ఏడుఅడుగులు వెయ్యబోతున్నట్లు చెప్పాడు..
ఫ్యామిలీ మెన్ కాబోతున్నాను అన్న ఫీలింగ్ తనకు చాలా బాగుందని.. ఈ గుడ్ న్యూస్ ని మీ అందరితో షేర్ చేసుకోవడం ఇంకా బాగుందని తన మనసులో మాటలని అందరితోనూ పంచుకున్నాడు మానస్.. ఇక కేరీర్ విషయానికొస్తే.. బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ గా తన నటనతో అందరి మనసులను గెలుచుకున్నాడు మానస్.. తన పాత్ర కుటుంబాన్ని ఎలా ముందుకు నడిపించాలో చూపిస్తుంది.. ఆ క్యారక్టర్ జనాలకు విపరీతంగా నచ్చేసింది.. పెళ్లి తర్వాత కొద్ది రోజులు సీరియల్స్ దూరం కాబోతున్నట్లు సమాచారం..