Site icon NTV Telugu

Maharashtra : నాగ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు, కారు ఢీ.. ఆరుగురు మృతి

New Project 2023 12 16t132422.077

New Project 2023 12 16t132422.077

Maharashtra : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కటోల్‌లోని సోంఖంబ్ గ్రామ సమీపంలో ట్రక్కు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వాహనంలోంచి మృతదేహాలను బయటకు తీశామని, పోస్టుమార్టం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. రాత్రి 1:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు కటోల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సుశాంత్ మెష్రామ్ తెలిపారు. రెండు వాహనాల వేగం ఎక్కువగా ఉండడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సమాచారం చేరవేశారు. వారు ప్రమాద స్థలానికి చేరుకుంటున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించనున్నారు.

Read Also: Revanth Reddy: గత చరిత్ర పై చర్చ చేద్దామా..? కేటీఆర్ పై రేవంత్ ఫైర్

ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. కారు ముందు భాగం బయటకు వచ్చింది. రోడ్డుపై కారు అద్దాలు చెల్లాచెదురుగా పడ్డాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కారులో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై ఎవరో పోలీసులకు సమాచారం అందించడంతో ఒక బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. ధ్వంసం అయిన వాహనాన్ని రోడ్డుపై నుంచి తొలగించి పక్కన పెట్టారు. రాత్రి ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. రెండు వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు మద్యం సేవించి ఉన్నారా అనే కోణంలో కూడా సమాచారం సేకరిస్తున్నారు. ఈ ప్రమాదానికి రెండు వాహనాల్లో సాంకేతిక సమస్య తలెత్తడం, లేదా ఏదైనా జంతువు రోడ్డుపైకి వచ్చి ఉండవచ్చని, దీని కారణంగా డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడం వంటి అనేక ఇతర కారణాలు ఉండవచ్చని పోలీసు అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రమాదానికి అసలు కారణం విచారణ తర్వాతే తేలనుంది.

Read Also:Prabhas: మీడియా ముందుకు నీల్ వస్తాడు సరే… మరి ప్రభాస్ పరిస్థితి ఏంటి?

Exit mobile version