Site icon NTV Telugu

Nagpur: 2019 అత్యాచారం, హత్య ఘటన.. నిందితుడికి మరణశిక్ష

Nagpur

Nagpur

2019 అత్యాచారం, హత్య ఘటనలో నాగ్ పూర్ కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302, IPC సెక్షన్ 376(A)(B), ఫొక్సో చట్టం కింద నిందితుడు సంజయ్ పూరి (32)కి జిల్లా జడ్జి, అదనపు సెషన్స్ జడ్జి SR పడ్వాల్ మరణశిక్ష విధించారు. వివరాల్లోకి వెళ్తే.. 2019 డిసెంబర్ 6న లింగ గ్రామంలోని వ్యవసాయ భూమి వద్ద బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఉంది. అయితే.. నిందితుడు అక్కడికి చేరుకుని అత్యాచారం చేసి హత్య చేశాడు. ఒక గుడ్డ నోట్లో కుక్కి.. శరీరమంతా రక్తంతో తడిసిపోయి బండరాయి సమీపంలో పడి ఉంది.

Read Also: Pakisthan: పాకిస్తాన్‌లో క్రిస్టియన్ని కొట్టి చంపిన టీఎల్పీ కార్యకర్తలు.. ఖురాన్‌ను అవమానించాడని

అయితే ఈ ఘటనలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాలికపై అత్యాచారం చేసి, కొట్టి చంపినట్లు తేలింది. పొలంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న సంజయ్ పూరీని అరెస్టు చేసినట్లు ఎస్పీపీ తెలిపారు. ఈ కేసులో మొత్తం 26 మంది సాక్షులను విచారించినట్లు పేర్కొన్నారు. కోర్టు నిందితుడికి ఐపిసి సెక్షన్ 376(2), పోక్సో చట్టంలోని సెక్షన్ 4 కింద జీవిత ఖైదు, అలాగే పోక్సో చట్టంలోని సెక్షన్ 10 కింద ఏడేళ్ల జైలుశిక్ష విధించిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రశాంత్ కుమార్ సత్యనాథన్ తెలిపారు.

Read Also: Hema: డ్రగ్స్‌ కేసులో నటి హేమకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ.

Exit mobile version