NTV Telugu Site icon

Nagarjuna: కొత్త దర్శకులతో నాగార్జున!

King Nagarjuna

King Nagarjuna

Nagarjuna’s New Movies Update: ‘కింగ్’ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. కథ నచ్చితే చాలు.. కొత్త దర్శకుడు అయినా సినిమా చేయడానికి ఏ మాత్రం వెనకాడరు. ఇటీవల ఆయన చేసిన నా సామిరంగ, ది ఘోస్ట్, బంగార్రాజు సినిమాలు కొత్త దర్శకులు తీసినవే. మరో ఇద్దరు యువ దర్శకులను కూడా నాగార్జున టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నారట.

నాగార్జున ప్రస్తుతం శేఖర్‌ కమ్ములతో ఓ సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో కుబేర తెరకెక్కుతోంది. ఈ చిత్రం తర్వాత కింగ్ కొత్త దర్శకుడితో చేయనున్నారు. ఈ చిత్రంతో తమిళ యువ దర్శకుడు నవీన్‌ తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ఈ సినిమాని జ్ఞానవేల్‌ రాజా నిర్మించనున్నారు. మరోవైపు సుబ్బు అనే కొత్త దర్శకుడి కథకు నాగార్జున పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. నాగార్జున నుంచి మరో కొత్త కలయికను ప్రేక్షకులు చూసే అవకాశం ఉంటుంది.

Also Read: MS Dhoni-IPL 2024: తొలి భారత క్రికెటర్‌గా ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు!

నాగార్జున చివరగా నటించిన నా సామిరంగ మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 14 రిలీజ్‌ అయిన నా సామిరంగ ప్రేక్షకులకు ఆకట్టుకుంది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, జిషు సేన్‌గుప్తా ఈ చిత్రంలో కీలక పాత్రలు చేశారు. కుబేరతో మరో హిట్ కొట్టాలని అక్కినేని ఫాన్స్ కోరుకుంటున్నారు.