బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. నాగ చైతన్య, సమంత విడాకులకు కేటీఆర్ కారణమని అని కీలక వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ ల ఫోన్ ట్యాప్ చేసింది నువ్వే (కేటీఆర్) కదా? అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. దీనిపై నాగ చైతన్య తండ్రి హీరో నాగార్జున స్పందించారు. “ఎక్స్” లో ఓ పోస్ట్ చేశారు. “గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.” అని ఎక్స్‌లో రాసుకొచ్చారు.
READ MORE: Shiv Sena Reddy: క్రీడా ప్రేమికులకు గుడ్‌న్యూస్.. ప్రతి గ్రామంలో సీఎం కప్
కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ కూడా స్పందించారు. కొండా సురేఖ.. దొంగ ఏడుపులు, పెడబొబ్బలు దేనికి? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ తరఫున ఆమె పై ఎవరు మాట్లాడలేదన్నారు. ఇదే సోషల్ మీడియాలో మాపైన ట్రోలింగ్ పేరుతో దాడి జరగడం లేదా? అని ప్రశ్నించారు. కొండా సురేఖ గతంలో ఉచ్చ ఆగడం లేదా అని అనలేదా?… ఇంకా ఆమె గతంలో మాట్లాడిన బూతు మాటలు గుర్తు తెచ్చుకోవాలన్నారు. ఈ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు ఎందుకు? అని మండిపడ్డారు. గతంలో కొండా సురేఖ మాట్లాడిన వీడియోలు పంపిస్తా మీకు కావాలంటే అని తెలిపారు. ఇదే కొండా సురేఖ గారు హీరోయిన్ల ఫోన్లు టాప్ చేశారని కామెంట్లు చేశారు. ఆమె ఆరోపణలు చేసిన వాళ్లు మహిళలు కాదా? వాళ్లకు మనోభావాలు ఉండవా? అన్నారు. మాపై అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న మహిళలు బాధపడ లేదా? వాళ్ళు ఏడ్వరా…?? అని మండిపడ్డారు.