Site icon NTV Telugu

Nagaland Governor: నాగాలాండ్ గవర్నర్ మృతి.. ఎవరీ గణేశన్..!

09

09

Nagaland Governor: నాగాలాండ్ గవర్నర్ ఎల్.గణేషన్(80) శుక్రవారం కన్నుమూశారు. ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఎల్.గణేషన్ పూర్తి పేరు లా గణేషన్ అయ్యర్. ఆయన ఫిబ్రవరి 16, 1945న జన్మించారు. గణేషన్ 20 ఫిబ్రవరి 2023న నాగాలాండ్ 19వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో 27 ఆగస్టు 2021 నుంచి 19 ఫిబ్రవరి 2023 వరకు మణిపూర్ 17వ గవర్నర్‌గా, 28 జూలై 2022 నుంచి 17 నవంబర్ 2022 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ (అదనపు బాధ్యత)గా పనిచేశారు.

READ MORE: Off The Record: మరోసారి రగిలిన వాటర్ వార్

ఎలా చనిపోయారు..
పలు నివేదిక ప్రకారం.. ఆగస్టు 8న చెన్నైలోని టినగర్‌లోని తన నివాసంలో ఎల్.గణేషన్ కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను వెంటనే చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పర్యక్షణలో చికిత్స తీసుకుంటూ శుక్రవారం మృతి చెందారు.

అసలు ఎవరీ ఎల్.గణేషన్..?
గణేషన్ 1945 ఫిబ్రవరి 16న తమిళనాడులోని ఇలకుమిరకవన్, అలమేలులోని ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు. తండ్రి మరణం తర్వాత గణేషన్ తన సోదరుడి పర్యవేక్షణలో చదువు కొనసాగించారు. తర్వాత ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చేరారు. ఆయన వివాహం చేసుకోకుండా తన ఉద్యోగాన్ని వదిలివేసి పూర్తి సమయం సంఘ్ కార్యకర్తగా, బీజేపీ పార్టీకి సీనియర్ నాయకుడిగా ప్రజా జీవితంలో గడిపారు. ఆయన గతంలో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు.

READ MORE: Russian fighter jet crash: ట్రంప్‌ను కలవడానికి ముందు పుతిన్‌కి దెబ్బ.. Su-30SM ఫైటర్ జెట్ మిస్సింగ్

Exit mobile version