Site icon NTV Telugu

Naga Chaitanya :నాగచైతన్య కెరీర్‌లో మరో సర్‌ప్రైజ్ ప్రాజెక్ట్ రెడీ!

Nagachaitanya

Nagachaitanya

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘తండేల్’ తర్వాత ఆయన కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ అనే మిస్టిక్ థ్రిల్లర్‌లో నటిస్తున్నా విషయం తెలిసిందే. సుకుమార్ సమర్పణలో బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా, చైతూ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతోంది. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఇప్పటికే ఓవర్సీస్ రైట్స్ పరంగా రికార్డు బిజినెస్ చేస్తూ భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే.. తాజాగా చై కి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది.

Also Read : Bigg Boss Telugu 9: విన్నర్ ప్రైజ్ మనీని మించిపోయిన తనూజ రెమ్యునరేషన్!

ఏంటంటే ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే, చైతూ తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ‘బెదురులంక’ ఫేమ్ దర్శకుడు క్లాక్స్ చెప్పిన వైవిధ్యమైన కథకు చైతన్య ఇంప్రెస్ అయ్యారట. ఈ కొత్త ప్రాజెక్ట్‌ను బన్నీ వాసు (బీవీ వర్క్స్), సునీల్ నారంగ్ కలిసి నిర్మించబోతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన మరియు హీరోయిన్ వివరాలు వెల్లడి కానున్నాయి. ఇలా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ డైరెక్టర్లతో చైతూ తన లైనప్‌ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు.

Exit mobile version