Site icon NTV Telugu

Nc 24 : నాగచైతన్య 24.. టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన మహేశ్ బాబు

Nc 24

Nc 24

అక్కినేని నాగచైతన్య హీరోగా విరూపాక్ష వంటి బ్లాక్ బస్టర్ సినిమాను డైరక్ట్ చేసిన కార్తీక్ దండు డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య కెరీర్ లో 24వ సినిమాను బీవీయస్ ఎన్ ప్రసాద్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సుమారుగా రూ. 120 కోట్లతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాగా నేడు అక్కినేని అందగాడు నాగ చైతన్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా NC24 టైటిల్ ను రివీల్ చేశారు.

Also Read : Nandamuri : మళ్లీ మొదటికొచ్చిన నందమూరి వారసుడి ఎంట్రీ

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎక్స్ ఖాతా ద్వారా ఈ సినిమా టైటిల్ ను ‘వృషకర్మ’ అని ఫిక్స్ చేస్తూ నాగ చైతన్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సరికొత్త లుక్ లో పవర్ఫుల్ లుక్ లో నాగ చైత్యన్య లుక్ బాగుంది. వృషకర్మ పోస్టర్ ను షేర్ చేస్తూ చైతుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రంలో చైతు సరసన సూపర్ హిట్ చిత్రాల బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. కాంతరా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ వృషకర్మకు సంగీతం అందిస్తున్నాడు. లపాతా లేడీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. తండేల్ హిట్ తో తొలిసారి వంద కోట్ల మార్కెట్ లో అడుగుపట్టిన చైతు బాబు ఇప్పుడు రాబోతున్న వృషకర్మ సినిమాతో అంతకు మించిన బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని అక్కినేని అభిమానులు ధీమాగా ఉన్నారు. వృషకర్మతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని ఆశిస్తూ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో హిట్స్ అందుకోవాలని కోరుతూ పుట్టినరోజులు శుభాకాంక్షలు చైతు.

Exit mobile version