నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం ఏదైనా ఉందా? అంటే, అది మోక్షజ్ఙ ఎంట్రీ కోసమే. గత కొంత కాలంగా బాలయ్య వారసుడి హీరో ఎంట్రీ కోసం ఎదురు చూస్తునే ఉన్నారు అభిమానులు. ఆ మధ్య మోక్షు హీరోగా ఓ సినిమా కూడా అనౌన్స్ చేశారు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా ఉంటుందని ప్రకటించారు. ఇక పూజా కార్యక్రమానికి సిద్ధం అనే సమయంలో.. ఎందుకో సడెన్‌గా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అప్పటి నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో.. దాదాపుగా ఈ ప్రాజెక్ట్ అటకెక్కినట్టేనని అంతా ఫిక్స్ అయ్యారు. దీంతో.. మళ్లీ మోక్షు ఎంట్రీ ఎప్పుడు? అని వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు.
Also Read : Bollywood : లాంగ్ గ్యాప్ తీసుకున్న ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోలు..
ఈ నేపథ్యంలో తాజాగా బాలయ్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న బాలయ్య.. ఆదిత్య 369 సీక్వెల్ కు సంబంధించిన కీలక ప్రకటన చేశారు. తన తనయుడు మోక్షజ్ఞతో కలిసి ఈ సీక్వెల్ చేస్తున్నానని.. ‘ఆదిత్య 999 మాక్స్’ అనే పేరుతో ఈ సినిమా రూపుదిద్దుకొంటుందని ప్రకటించారు. నిజానికి గతంలో బాలయ్య పలు సందర్భాల్లో ఇదే విషయాన్ని చెబుతూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే చెప్పారు. కానీ దర్శకుడు ఎవరు? సినిమా ఎప్పుడు ఉంటుంది? అనే విషయాలు వెల్లడించలేదు. దీంతో.. మోక్షు ఎంట్రీ మళ్లీ మొదటికి వచ్చేసిందనే చెప్పాలి. కానీ ఆదిత్య 369 సీక్వెల్‌కు క్రిష్ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని ప్రచారంలో ఉంది. ఇప్పటికే స్క్రిప్టు కూడా దాదాపుగా ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.