AP Cabinet: ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఏపీ మంత్రివర్గంలో చోటుదక్కింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం నాగబాబు జనసేన ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను అనుసరించి.. 25 మంత్రి పదవులకు ఛాన్స్ ఉంది. ప్రస్తుతం మంత్రివర్గంలో 24 మంది ఉన్నారు. జనసేన నుంచి ముగ్గురు మంత్రులుగా ఉండగా.. కూటమి పొత్తులో భాగంగా 4 మంత్రి పదవులు రావాల్సి ఉంది. ఈ క్రమంలో నాగబాబు మంత్రిమండలిలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
Read Also: Andhra Pradesh: టీడీపీ రాజ్యసభ సభ్యులు ఖరారు
మరోవైపు ఏపీ నుంచి ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు బీజేపీ నుంచి ఒకరిని, టీడీపీ నుంచి ఇద్దర్ని ఎంపిక చేయాలని కూటమి అధిష్ఠానం నిర్ణయించింది. సానా సతీష్, బీద మస్తాన్ రావు పేర్లను టీడీపీ ఖరారు చేయగా.. ఆర్.కృష్ణయ్య పేరును ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. బీద మస్తాన్ రావు.. గత ప్రభుత్వంలో రాజ్యసభ ఎంపీ.. వైసీపీ నుంచి జంప్ చేసి 2024 రాష్ట్ర జనరల్ ఎలక్షన్ల సమయానికి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే బీద మస్తాన్ రావు ఒక వ్యాపారవేత్త.. అలాగే కచ్చితంగా తన రాజ్యసభ ఎంపీ స్థానం తనకే ఉంటుందనే హామీ తీసుకుని పార్టీ మారినట్లు తెలిసింది. అయితే టీడీపీ నుంచి బలమైన ప్రామిస్ ఇవ్వడంతో టీడీపీ తరఫున రాజ్యసభకు వెళ్ళడానికి బీదా మస్తాన్ రావు నిర్ణయించుకున్నారు. తాజాగా టీడీపీ కూడా రాజ్యసభకు ఖరారు చేయడం గమనార్హం. మరోవైపు ఇప్పటికే కాకనాడ ఎంపీ స్థానాన్ని ఆశించి వదులుకున్న సానా సతీష్‌కు కూడా రాజ్యసభ స్థానాన్ని టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. బీసీలలో బీజేపీని చొప్పించడానికి ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ ఇచ్చి బీజేపీ కండువా కప్పారు. ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఎవరనేది ఫైనల్ కావడంతో ఏపీ నుంచి ఆ ముగ్గురి నామినేషన్లు ఏకగ్రీవం కానున్నాయి.