Site icon NTV Telugu

Nadendla Manohar: జగనన్న పాపాల పథకం పోలవరం ప్రాజెక్ట్

Nadendla Manohar

Nadendla Manohar

ఏపీలో జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా ఢిల్లీ పర్యటన అనంతరం రెండు పార్టీ నేతల మధ్య వార్ పీక్స్ కి చేరింది. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వైసీపీపై, సీఎం జగన్ సర్కార్ పై సంచలన ఆరోపణలు చేశారు. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు పరిమితం చేసేందుకు అంగీకరిస్తూ ఏపీ ప్రభుత్వం సంతకాలు చేసిందన్న నాదెండ్ల.త్వరలో పోలవరం ప్రాజెక్టుకు పవన్ కళ్యాణ్ వెళ్తారని నాదెండ్ల వెల్లడించారు పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తును కలిశాం.పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరంపై తెలిసిన కొన్ని విషయాలు మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది.

పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకాలు చేశారు.పునరావాసం ఖర్చును తగ్గించుకునేందుకే ఈ ప్రయత్నం. పునరావాసం మొత్తాన్ని పెంచుతామని హామీని అమలు చేయకుండా ఉండేందుకు పోలవరం ఎత్తును తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది.

Read Also: Today Stock Market Roundup 05-04-23: కిక్‌ ఇచ్చిన క్వార్టర్‌-4 ఫలితాలు

పోలవరం ఎత్తు తగ్గించేందుకు ప్రభుత్వం సంతకాలు చేసిందా..? లేదా..? అనే విషయం రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి.పోలవరం నిర్మాణానికి సంబంధించి ఖర్చులు రీ-ఇంబర్స్ చేస్తామని కేంద్రం చెప్పినా.. పనులెందుకు చేపట్టడం లేదు.జగనన్న పాపాల పథకం పోలవరం.ఏపీ ప్రభుత్వం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో చర్చించాం.పోలవరం ప్రాజెక్టు పూర్తి చేద్దామనే చిత్తశుద్ధి సీఎం జగనుకు లేదు.పోలవరం నిర్మించకుండా ప్రజలను మోసగించే విధంగా వైసీపీ వ్యవహరిస్తోంది.పోలవరం పూర్తి చేసి సాగునీరు అందిస్తామని వివిధ తేదీలు ప్రకటించారు. కానీ ఏదీ నిలబెట్టుకోలేదు.త్వరలోనే పవన్ కళ్యాణ్ పోలవరంలో పర్యటిస్తారని తెలిపారు మనోహర్.

Read Also: Today Stock Market Roundup 05-04-23: కిక్‌ ఇచ్చిన క్వార్టర్‌-4 ఫలితాలు

Exit mobile version