పేదలకు నాణ్యమైన విద్య పేరుతో ప్రభుత్వ ఖజానాకు భారంగా మారే ఒప్పందాలు జగన్ ప్రభుత్వం చేసుకుంటోంది అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. టీచర్లకు జీతాలివ్వడంలో విఫలమవుతోన్న ప్రభుత్వం ఇతర దేశాలకు చెందిన సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది.. ప్రాథమిక అంశాలను పక్కన పెట్టి.. విద్యా రంగంలో కొత్త విధానాలను ప్రవేశపెడుతోంది.. టోఫెల్ శిక్షణ కోసం 54 పేజీల ఒప్పందం.. ఆ ఒప్పందాన్ని మంత్రి బొత్స చదివాలి అని ఆయన అన్నారు. ఇక ఐబీ సంస్థతో మరో ఒప్పందం కుదుర్చుకుంది.. భారత దేశ చట్టాలు ఐబీ సంస్థకు వర్తించవట.. ఏమైనా తేడా వస్తే జెనీవా కోర్టులో తేల్చుకోవాలంట.. టీచర్ల ట్రైనింగ్ నిమిత్తం రూ. 1200 కోట్ల నుంచి రూ. 1500 కోట్లు ఖర్చు పెట్టేలా ఒప్పందం చేసుకున్నారని నాదెండ్ల మనోహార్ అన్నారు.
Read Also: PM Modi: భారతీయుడు చంద్రునిపై దిగే రోజు ఎంతో దూరంలో లేదు..
న్యాయశాఖ తిరస్కరించిన అంశాలను.. క్లాజులను ఒప్పందంలో పెట్టి మరీ కెబినెట్ ఆమోదించాల్సిన అవసరమేంటీ?.. అని నాదెండ్ల మనోహర్ అడిగారు. విద్యార్థుల సంఖ్య విషయంలో.. అమ్మఒడి లబ్దిదారుల సంఖ్య విషయంలో తేడాలున్నాయి.. సుమారు 5.71 లక్షల మంది విద్యార్థుల పేరుతో అమ్మ ఒడి నిధులు, విద్యా కానుక నిధులు పక్కదారి పట్టాయి.. సుమారు రూ. 743 కోట్ల మేర అమ్మఒడి నిధులు పక్కదారి పట్టాయని ఆయన ఆరోపించారు.
Read Also: El Nino: 2024 మధ్య వరకు ఎల్ నినో.. వ్యవసాయం, మత్స్య పరిశ్రమకు ముప్పు..
అమ్మఒడిలో స్కాం జరిగింది.. ఇవాళ మంత్రి బొత్స పదే పదే ఒప్పందాలన్నీ కెబినెట్ నిర్ణయం మేరకు జరిగాయని ఎందుకు చెప్పుకొచ్చారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పేద విద్యార్థుల పేరుతో దోపిడీ జరుగుతోంది.. ఐబీ కరిక్యులమ్ తీసుకురావాలని ఎందుకు ఇంత ఒత్తిడి తెస్తున్నారు? అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఈ ఒప్పందాల వెనుకున్న మతలబేంటీ? అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. రూ. 100 కోట్ల దాటిన ప్రతి కార్యక్రమానికి జుడిషియరీ ప్రీవ్యూ ముందు పెడతామన్నారు.. ఇప్పుడెందుకు పెట్టలేదు.. విద్యాశాఖలో మరిన్ని స్కాంలు జరిగాయి.. అవి త్వరలో బయటపెడతాం అని ఆయన తెలిపారు.