NTV Telugu Site icon

Nadendla Manohar: జూలై 15 నుంచి రోడ్లపై సోషల్ మీడియా ప్రచారం

Janasena

Janasena

రాష్ట్ర ప్రజానీకం కోసం జనవాణి నిర్వహిస్తున్నాం అన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. సీఎం జగన్ తాడేపల్లి వదిలి రావడం లేదు. అనేక మంది ప్రజలు తమ సమస్యలను జనసేన నాయకులకి చెబుతున్నారు. ఫిర్యాదు అందిన సాయంత్రం వరకు సమస్య సంబంధం ఉన్న అధికారికి తెలియచేసి పరిష్కారం దిశగా అడుగులు వేస్తాం అన్నారు. ఈ ఆదివారం, వచ్చే ఆదివారం రెండు రోజులు విజయవాడ లో ప్రజావాణి నిర్వహిస్తున్నాం అన్నారు మనోహర్. మిగతా వారాలు ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, రాయలసీమ లో ప్రజావాణి నిర్వహిస్తాం అన్నారు.

వేదిక ద్వారా సామాన్యుడి గళం విప్పండి. ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డుయింగ్ ఎవరికి ఉపయోగపడింది. రాష్ట్రంలో ఉన్న అవినీతి చూసి పెట్టుబడులు పెట్టటానికి ఏ కంపెనీ ముందుకు రావట్లేదు. విజయవాడ మున్సిపాలిటీ పరిధిలో అధ్వాన్న పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఎక్కడ చూసినా రోడ్ల దుస్థితి దారుణంగా వుంది. జూలై 15 నుంచి సోషల్ మీడియా ద్వారా రోడ్ల గురించి ప్రచారం చేస్తాం. గడప గడపకు మన ప్రభుత్వం ఒక బూటకం. వైసీపీ నాయకులను చూసి తమ సమస్యల గురించి ఫిర్యాదులు చేయటానికి ప్రజలు భయపడుతున్నారన్నారు నాదెండ్ల మనోహర్.

Janasena Party: ‘జనవాణి’ పేరుతో కొత్త కార్యక్రమం.. ప్రజల విజ్ఞప్తులు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్