NTV Telugu Site icon

Nadendla Manohar : రైతు బజార్లలో తగ్గించిన ధరలకు కందిపప్పు, బియ్యం

Nadendla Manohar

Nadendla Manohar

నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను తగ్గించి గురువారం నుంచి రైతు బజార్లలో విక్రయిస్తారని రాష్ట్ర ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రాష్ట్రంలో నిత్యావసర సరకులను ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంచడం, వారికి ఉపశమనం కలిగించడం అవసరమని శ్రీ మనోహర్ గారు తెలిపారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.181 ఉన్న కందిపప్పు రూ.160, బియ్యం రూ.52.40 ఉంటే రూ.48కీ, స్టీమ్డ్ బియ్యం రూ.55.85 ఉంటే రూ.49 చొప్పున విక్రయిస్తారు. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం తగ్గించిన ధరలకు విక్రయించాలని నిర్ణయించారు. వీటిని స్థానిక చుట్టుగుంట, ఆర్టీసీ బస్టాండ్‌ల సమీపంలోని రైతు బజార్లతోపాటు తెనాలి, పొన్నూరు, మంగళగిరి రైతు బజార్లలో విక్రయిస్తారన్నారు. జిల్లాలోని రైస్‌ మిల్‌ పాయింట్ల వద్ద బీపీటీ బియ్యం అందుబాటులో ఉంచుతామన్నారు. గుంటూరులోని 15 హోల్‌సేల్‌ డాల్‌ మిల్లుల వద్ద కూడా సబ్సిడీ సరుకుల విక్రయాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.