NTV Telugu Site icon

Nadella Manohar: పవన్ కల్యాణ్‌పై అక్రమ కేసులు..! ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడతారా..?

Nadendla Manohar

Nadendla Manohar

Nadella Manohar: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అక్రమ కేసులు పెడుతున్నారు.. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడతారా..? అని నిలదీశారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వాలంటీర్ వ్యవస్థ లో ఉన్న లోపాలు ఎత్తి చూపిస్తే బెదిరింపులకు దిగుతున్నారు.. వాలంటీర్ ల వ్యవస్థకు బాధ్యులు ఎవరు..? అని మండిపడ్డారు. ప్రజల వ్యక్తి గత సమాచారం తీసుకుని ఎక్కడ స్టోర్ చేస్తున్నారు.. అలా వ్యక్తిగత సమాచారం తీసుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు..? ఇవే ప్రశ్నలు పవన్ కల్యాణ్‌ అడిగారు.. ఇలా ప్రశ్నిస్తే వాలంటీర్ ల వ్యవస్థను దూషించినట్లా? అని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వైఎస్‌ జగన్ తన సైన్యం అని చెప్పుకునే, 2,55,461 మంది వాలంటీర్లలో 1,02,836 వాలంటీర్ల డేటా అసలు రికార్డులలోనే లేదు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.. అసలు వీళ్లంతా ఎక్కడ ఉన్నారు తెలియదు..? అన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తాం అని ప్రకటించారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.

Read Also: Mahesh kumar Goud: మంత్రి ఉత్తమ్ ప్రెసెంటేషన్ తో హరీష్ దిమ్మతిరిగింది

కాగా, గతంలో పలు సందర్భాల్లో వాలంటీర్లపై పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.. అసలు వాలంటీర్లకు నాయకుడు ఎవరు? వారికి అన్ని అధికారాలు ఎందుకు? ప్రజల వివరాలు తీసుకెళ్లే ఎక్కడో పెట్టేస్తున్నారు.. ఎవరికో ఇవ్వాల్సిన అవసరం ఏంది అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.. ఇదే సమయంలో.. పవన్‌కు వ్యతిరేకంగా వాలంటీర్లు ఆందోళనలు నిర్వహించిన విషయం విదితమే.. ఇదే సందర్భంలో పోలీస్‌ స్టేషన్లలో సైతం ఫిర్యాదు చేశారు వాలంటీర్లు. అయితే, తాను మొత్తం వాలంటీర్‌ వ్యవస్థను తప్పుబట్టడం లేదని.. వాలంటీర్లలో ఉన్న కొందరు క్రిమినల్స్‌ గురించేనని.. అయినా అందరి డేటాను ఎవరి చేతిలోనో పెట్టాల్సిన అవసరం ఏంటి? అని పవన్‌ నిలదీసిన విషయం విదితమే.