Prashanth Neel 418: మైత్రీ – ప్రశాంత్ నీల్ ‘418’ టైటిల్ పోస్టర్ రిలీజ్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు రూట్ మార్చింది. కమర్షియల్ ఎంటర్‌టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే ఈ సంస్థ, తొలిసారిగా పక్కా హారర్ జోనర్‌లోకి అడుగుపెడుతోంది. కె.జి.ఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పణలో, కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్ ‘418’. తాజాగా విడుదలైన ఈ సినిమా టైటిల్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Allso Read : Parshuraam: హోంబలే సినిమాటిక్ యూనివర్స్ నుంచి..పరశురామ్ భారీ అనౌన్స్‌మెంట్!
Also Read
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు కోర్టు బిగ్ షాక్..
- Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
- Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
- Gudivada Amarnath: 1-2 కేసులు ఉంటే మనిషిని చంపేస్తారా?.. ప్రజలు భయపడిపోతున్నారు!
ఈ సినిమా ట్యాగ్‌లైన్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది.. “హారర్ సినిమాల్లో నవ్వింది చాలు.. ఇక భయపడాల్సిన సమయం వచ్చింది” (Enough of laughing in horror movies. Now it’s time to be scared). ఇటీవలి కాలంలో హారర్ సినిమాల్లో కామెడీ ఎక్కువైపోయి భయం తగ్గిపోయిందనేది ప్రేక్షకుల ఫీలింగ్. ఆ లోటును భర్తీ చేస్తూ, కేవలం భయాన్ని మాత్రమే పంచే ‘ప్యూర్ హారర్’ చిత్రంగా ‘418’ రాబోతోందని ఈ ట్యాగ్‌లైన్ ద్వారా డైరెక్టర్ స్పష్టం చేశారు. రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్‌లో రక్తం మరకలతో ఉన్న ఒక తలుపు, దానిపై ‘418’ అనే నంబర్ కనిపిస్తున్నాయి.
ఈ పోస్టర్ చూస్తుంటే ఇది సైకలాజికల్ హారర్ లేదా ఒక మిస్టరీ గది చుట్టూ తిరిగే కథ అని అర్థమవుతోంది. ఇందులో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రెజెంట్ చేస్తుండటంతో సినిమా రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆయన సినిమాల్లో ఉండే ‘డార్క్ థీమ్’ ఈ హారర్ మూవీకి కూడా తోడైతే, థియేటర్లలో ఆడియెన్స్‌కు ఒక కొత్త అనుభూతి లభించడం ఖాయం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
తాజావార్తలు
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్‌తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు కోర్టు బిగ్ షాక్..
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
-
SBI PO Recruitment 2026: 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు ఎస్బీఐ నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, జీతం పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్‌కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్‌కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!