NTV Telugu Site icon

Murder Mystery Case: విజయనగరంలో వృద్దురాలి హత్య కేసులో వీడిన మిస్టరీ

Murder

Murder

విజయనగరం జిల్లా మహారాజుపేట గ్రామములో వృద్దురాలి హత్య కేసులో మిస్టరీ వీడింది. హంతకుడు విజయనగరం మండలం గుంకలాం గ్రామానికి చెందిన ఇజ్జరపు కుర్మారావుగా పోలీసులు వెల్లడించారు. హంతకుడు కూర్మారావు బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్ధిగా గుర్తించారు. వ్యసనాలకు బానిసై బంగారం కోసం వృద్దురాలిని హత్య చేసినట్టు తెలిపారు. వృద్దురాలి ఇంట్లో అద్దెకు ఉంటూ తగరపువలస బ్రిడ్జి వద్దనున్న ఇంజనీరింగ్ కాలేజీలో కూర్మారావు చదువుతున్నాడు. అయితే, అమ్మాయిలు, మద్యంతో రూంలో పార్టీలు చేసుకుంటున్న కూర్మారావుతో తరచూ వృద్ధురాలు గొడవపడేదని పోలీసులు పేర్కొన్నారు.

Read Also: True lover : “ట్రూ లవర్”గా మారిన “గుడ్ నైట్” హీరో.. మరో బేబీ లోడింగ్

ఇక, జల్సాలకు అలవాటు పడి కూర్మారావు వృద్ధురాలు ఒంటిపై ఉన్న బంగారం కన్నేశాడు. దీంతో ఆమె ఒంటిపై ఉన్న 6 తులాల బంగారాన్ని కాజేసి బాత్రూంలో కాలుజారి పడిపోయినట్లు చిత్రీకరించాడు. పోలీసుల విచారించరణలో తానే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఇక, కూలి పనులు చేస్తూ కొడుకు కూర్మారావును ఇంజనీరింగ్ చదివిస్తున్న తల్లిదండ్రులు విషయం తెలిసి షాక్ అయ్యారు. అయితే, కూర్మారావును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. ఈ మర్దర్ కు సంబంధించిన వివరాలను సీఐ బీ.వీ. వెంకటేశ్వరరావు, ఎస్సై సూర్య కుమారి వెల్లడించారు.