Site icon NTV Telugu

Mynampally Hanumanth Rao : ప్రభుత్వంది ఒంటెద్దు పోకడ.. మహిళ నాయకులకు రాత్రివేళ ఫోన్లు చేస్తూ

Mynampally

Mynampally

మల్కాజ్‌గిరి లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మైనంపల్లి హనుమంతరావు అనుచరుల పై పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆరోపించారు.. ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు వెళ్తూ కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకులకు రాత్రివేళ ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు.. అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ ఆనంద్ కిషోర్ వైఖరి సరిగా లేదని ఆయనను కలిసెందుకు వస్తే సమావేశం పేరుతో తప్పించుకున్నారని అన్నారు..

Also Read : Shah Rukh Khan: షారుఖ్ కి వై ప్లస్ భద్రత ఎలా ఉంటుందో తెలుసా?

ఇటీవల రాక్ గార్డెన్ లో జరిగిన గొడవలు దాడి చేసిన వారిపై కాకుండా అడ్డుకున్న తమపై కేసులను నమోదు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలని అన్నారు.. గొడవ జరిగే క్రమంలో అక్కడ ఘటన స్థలిలో లేని వారి పై కూడా కేసులు నమోదు అయ్యాయని అన్నారు.. ప్రభుత్వం తన గన్ మెన్లను కూడా మార్చిందని ఇది సరైన చర్య కాదని ప్రజలంతా త్వరలోనే తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు.. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అనుచరులపై అక్రమంగా కేసులు బనాయిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. దళిత బంధు, బీసీ బందు, మైనారిటీ బందు సహా, అన్ని ప్రభుత్వ పథకాలలోను ఎవరెవరు ఎంతెంత వాటా తీసుకున్నారో తన వద్ద లిస్టు ఉందని, అన్నిటిని బయటపడతానని మైనంపల్లి సవాల్ చేశారు.

Also Read : Chennai: ఓ వ్యక్తి అకౌంట్కు రూ.2000 పంపితే రూ.753 కోట్లు జమ..

Exit mobile version