Earthquake: నేడు (సెప్టెంబర్ 21) బంగ్లాదేశ్‌లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించడంతో మేఘాలయలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ భూకంపం ఉదయం 11:49 గంటలకు (IST) బంగ్లాదేశ్‌తో మేఘాలయ సరిహద్దుకు సమీపంలో సంభవించిందని అక్కడి అధికారులు వెల్లడించారు. అయితే, మేఘాలయలో ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా బంగ్లాదేశ్‌లోని ఢాకా, చిట్టగాంగ్‌తో సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. అయితే, ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు.
IND vs PAK: నిజానికి మ్యాచ్ రిఫరీ పాకిస్థాన్‌ను రక్షించాడు.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
బంగ్లాదేశ్ వాతావరణ శాఖ (Bangladesh Meteorological Department) ప్రకారం, బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న మయన్మార్‌లోని మండలే వద్ద మధ్యాహ్నం 12:25 గంటలకు భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఢాకా నుండి ఈ భూకంప కేంద్రానికి దూరం 597 కిలోమీటర్లు ఉంది. అలాగే అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) నివేదిక ప్రకారం, భూకంప కేంద్రం మయన్మార్‌లోని సాగైంగ్‌కు ఉత్తర-వాయువ్య దిశలో 16 కిలోమీటర్ల దూరంలో, భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో ఉందని తెలిపింది. ఈ భూకంపం స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేసినప్పటికీ, ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
DishaPatani : దిశా పటాని వయ్యారాల వేడిని ఏసీ, కూలర్లు కూడా తగ్గించలేవేమో
