పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898AD.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మహానటి సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిన దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో ఇదివరకు ఎన్నడు కనిపించని పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నారు.అంతేకాదు ప్రభాస్ తన సినీ కెరీర్లోనే ఎప్పుడూ టచ్ చేయని జోనర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.దీంతో ఈ మూవీ పై భారీ గా అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ సినిమా పై ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేసింది. ఇందులో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణే, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే దీపికా, ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల అయ్యాయి. ఇదిలా ఉంటే ఈరోజు (అక్టోబర్ 11) అమితాబ్ బర్త్ డే కావడంతో ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేసారు.. ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ తన కల నెరవేరిందంటూ ఇంస్టాగ్రామ్ లో ఆసక్తికరంగా రాసుకొచ్చారు ప్రభాస్.అక్టోబర్ 11న అమితాబ్ 81వ పుట్టినరోజు జరుపుకోనున్నారు.ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.
ఈ క్రమంలో కల్కి చిత్రయూనిట్ కూడా బర్త్ విషెస్ తెలుపుతూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. అందులో అమితాబ్ లుక్ ఆకర్షిస్తోంది. గుహలో సూర్య కిరణాల వెలుగు మధ్య ఒళ్లంతా.. ముఖాన్ని గుడ్డతో కప్పుకుని .. చేతిలో కర్ర నిలువెత్తు మనిషిలా నిలబడి ఉన్నారు బిగ్ బి. ఆయన పోస్టర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ పోస్టర్ ను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ బిగ్ బీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రభాస్..కొన్ని తరాలకు స్పూర్తినిచ్చిన ఒక లెజండ్ తో కలిసి పనిచేయడం నాకు దక్కిన వరం. నిజంగా కల నెరవేరడం అంటే ఇదేనేమో . పుట్టినరోజు శుభాకాంక్షలు సార్’ అంటూ రాసుకొచ్చారు ప్రభాస్. అయితే కల్కి 2898AD సినిమా ను వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ మరియు మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.. ఈ సినిమాను దాదాపు రూ.600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తోంది.మరి ఈ సినిమా విడుదల అయితే ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి..