My Dr Headache Roll on Ad in Times Square: అమెరికా వాణిజ్య రాజధానిగా గుర్తింపు పొందిన న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్ స్క్వేర్‌లో ఓ యాడ్ ప్రదర్శించడం అంటే మామూలు విషయం కాదు.. ప్రముఖ బ్రాండ్లకు, ప్రముఖ వ్యక్తులకు మాత్రమే సాధ్యం అవుతుంది.. టైమ్ స్క్వేర్‌లో ప్రదర్శించారంటే.. అది ప్రపంచస్థాయి అనే విధంగా చెప్పుకుంటారు.. టైమ్స్ స్క్వేర్ యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూయార్క్ సిటీలో ఉంది.. మిడ్‌టౌన్ మాన్‌హాటన్‌లోని ఒక ప్రధాన వాణిజ్య కూడలి, పర్యాటక కేంద్రం, వినోద కేంద్రంగా పిలుస్తారు.. అయితే, తొలిసారి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ వాణిజ్య యాడ్ టైమ్ స్క్వేర్‌లో ప్రదర్శించబడింది..
మెడ్ మనోర్ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Med Manor Organics Private Limited) పలు రకాల హెల్త్ ప్రోడక్స్ అందిస్తోంది.. ఇప్పటికే మైడాక్టర్ ఫెయిన్ రిలీఫ్ ఆయిల్, మైడాక్టర్ ఫెయిన్ రిలీఫ్ క్రీమ్, మైడాక్టర్ ఫెయిన్ రిలీఫ్ స్ప్రే లాంటివి అందిస్తుండగా.. తాజాగా, (My Dr Headache roll-on) మైడాక్టర్ హెడేక్ రోల్-ఆన్ ను లాంచ్ చేసింది.. దీనికి సంబంధించిన యాడ్.. జూన్ 30వ తేదీన టైమ్ స్క్వేర్‌లో ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఈ అరుదైన అవకాన్ని దక్కించుకున్న తొలి బ్రాడ్ కాస్టింగ్ యా మైడాక్టర్ హెడేక్ రోల్-ఆన్‌దే కావడం విశేషంగా చెప్పుకోవాలి.. ఇక, తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితారా నటించిన యాడ్ ఒకటి టైమ్ స్క్వేర్‌లో ప్రదర్శించిన విషయం విదితమే కాగా.. అంతకు ముందే ఆ అవకాన్ని దక్కించుకుంది మైడాక్టర్ హెడేక్ రోల్-ఆన్.
కాగా, టైమ్స్ స్క్వేర్ అనేక డిజిటల్ బిల్‌బోర్డ్‌లు మరియు ప్రకటనలతో పాటు 24 గంటల పాటు ప్రకాశవంతంగా వెలిగిపోతుంది. ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే పాదచారుల ప్రాంతాలలో ఒకటి, ఇది బ్రాడ్‌వే థియేటర్ డిస్ట్రిక్ట్ కేంద్రంగా ఉంది.. ప్రపంచ వినోద పరిశ్రమకు ప్రధాన కేంద్రం కూడా ఇదే.. టైమ్స్ స్క్వేర్ ప్రపంచంలోనే అత్యధికంగా పర్యాటకులను ఆకర్షించే ప్రాంతం.. సంవత్సరానికి దాదాపు 50 మిలియన్ల మంది సందర్శకులను ఇక్కడ పర్యటిస్తారు. దాదాపు 330,000 మంది వ్యక్తులు ప్రతిరోజూ టైమ్స్ స్క్వేర్ నుంచి వెళ్తారు.. వారిలో చాలామంది పర్యాటకులు, 460,000 మంది పాదచారులు టైమ్స్ స్క్వేర్ గుండా అత్యంత రద్దీగా ఉండే రోజుల్లో నడుస్తారు. అలాంటి చోట మైడాక్టర్ హెడేక్ రోల్-ఆన్ ప్రకటన ప్రదర్శించడం అంటే మామూలు విషయం కాదు మరి.