MVSP Collections: అల్ టైం రీజనల్ ఇండస్ట్రీ హిట్.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ జోరు మాములుగా లేదుగా!

Mvsp

Mvsp

MVSP Collections: మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన వెండితెరపై కనిపిస్తే చాలు రికార్డులు వాటంతట అవే క్రియేట్ అవుతుంటాయి. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో చిరు మరోసారి తన సత్తా చాటారు. కేవలం రీజనల్ సినిమాగా విడుదలై, పాన్ ఇండియా చిత్రాల రేంజ్ కలెక్షన్లతో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్‌ను సెట్ చేశారు.

Google Pixel 10a Launch: 48MP కెమెరా, 5100mAh బ్యాటరీ.. అతి తక్కువ ధరలో ‘పిక్సెల్‌ 10ఏ’ ఫ్లాగ్‌షిప్ ఫోన్!

2026 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా 25 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఇప్పటివరకు ఏకంగా రూ. 375 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. గతంలో తెలుగులో మాత్రమే విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (రూ. 303 కోట్లు) పేరిట ఉన్న రికార్డును చిరంజీవి బద్దలు కొట్టారు.

అయితే బాహుబలి, పుష్ప వంటి చిత్రాలు ఇతర భాషల్లోనూ విడుదలై రికార్డులు సృష్టించగా.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ కేవలం తెలుగు వెర్షన్‌తోనే ఈ భారీ ఘనత సాధించడం విశేషం. మొదటి రోజే రూ. 84 కోట్ల గ్రాస్‌తో చిరు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది. ఇక 7 రోజుల్లోనే రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి ప్రాంతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం సుమారు 5 మిలియన్ డాలర్ల మార్కును అందుకుంది అంటే నమ్మండి.

భారీగా పెరిగిన TVS Jupiter ధరలు.. వేరియంట్ లైనప్‌లో తాజా ధరలు ఇక్కడ చెక్‌ చేయండి..

థియేటర్లలో రికార్డులు సృష్టించిన ఈ బ్లాక్ బస్టర్ హిట్, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అలరించడానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 11 నుంచి ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లో మిస్ అయిన వారు లేదా మళ్ళీ చూడాలనుకునే వారు ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే ఎంజాయ్ చేయవచ్చు.